Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలకు 'బేబీ' వాంటెడ్ అయ్యేనా?

వైష్ణవి తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 July 2023 3:53 AM GMT
స్టార్ హీరోలకు బేబీ వాంటెడ్ అయ్యేనా?
X

యూట్యూబర్ గా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుని.. పలు చిత్రాల్లో కనీసం గుర్తింపుకు కూడా నోచుకోని పాత్రల ను చేసిన వైష్ణవి చైతన్య ఒక్కసారిగా 'బేబీ' సినిమా కారణంగా స్టార్ అయింది. ఆనంద్ దేవరకొండకు జోడీ గా 'బేబీ' సినిమా లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది అనడం లో సందేహం లేదు.

బేబీ సినిమా లో ఇద్దరు హీరోలు ఉన్నా కూడా హీరోయిన్‌ వైష్ణవి గురించి ప్రేక్షకులు.. మీడియా వారు.. ఇండస్ట్రీ వర్గాల వారు.. నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు అంటే ఆ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. కాస్త నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రను చేసేందుకు హీరోయిన్స్‌ భయపడుతారు. కానీ వైష్ణవి మాత్రం చాలా ధైర్యంగా ఈ పాత్రను చేసి తన ను తాను నిరూపించుకుంది.

హీరోయిన్‌ గా బేబీ సినిమా వైష్ణవికి బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ సక్సెస్ ను అందించింది. సాధారణంగా ఉత్తరాది ముద్దుగుమ్మలు ఈ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటే టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఆ హీరోయిన్ వెంట పడి మరీ అడ్వాన్స్ లు ఇచ్చే వారు. కానీ వైష్ణవి తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బేబీ సినిమా విడుదల కు ముందే నిర్మాత ఎస్‌ కే ఎన్‌ బ్యానర్‌ లో మరో రెండు సినిమా లు చేసే విధంగా వైష్ణవి ఒప్పందం పై సైన్ చేసింది. అంతే కాకుండా బన్నీ వాసు కూడా వైష్ణవి తో ఒక సినిమా కు సైన్ చేయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్‌.. లేదా చిన్న చిత్రాల కు వైష్ణవి వాంటెడ్ గా మారిందేమో కానీ స్టార్‌ హీరోల కు ఈమె మోస్ట్‌ వాంటెడ్ గా మారే పరిస్థితి ఉందా అనే చర్చ జరుగుతోంది.

వైష్ణవి తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల టాలీవుడ్ లో అంతగా ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది. అయితే ఆమె తన ప్రతిభతో కష్టపడుతూ ముందుకు సాగితే తప్పకుండా మంచి స్థానం కు చేరుకోవడంతో పాటు ముందు ముందు మంచి సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉంటాయి.