Begin typing your search above and press return to search.

బేబీకి టాప్ లేపే రెమ్యునరేషన్..!

ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లో నటించి ప్రేక్షకులను దగ్గరైన వైష్ణవి చైతన్య సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:44 AM GMT
బేబీకి టాప్ లేపే రెమ్యునరేషన్..!
X

ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లో నటించి ప్రేక్షకులను దగ్గరైన వైష్ణవి చైతన్య సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. సినిమాలో వైష్ణవి తన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేసింది. మొదటి సినిమాలోనే చాలా డెప్త్ ఉన్న పాత్రలో తన నటనతో మెప్పించింది వైష్ణవి. ఈ క్రమంలో ఆ హిట్ క్రేజ్ తోనే వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇదే క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వైష్ణవితో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

నూతన దర్శకుడు అరుణ్ భిమవరపు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో దిల్ రాజు ఇంటి హీరో ఆశిష్ నటిస్తుండగా ఫీమేల్ లీడ్ గా వైష్ణవిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వైష్ణవి నటించేందుకు గాను ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బేబీ వైష్ణవి కి ఈ సినిమా కోసం దాదాపు 1 కోటి దాకా రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రాణించడం అనేది పెద్ద విషయం అంతేకాకుండా తోటి స్టార్ హీరోయిన్స్ లాగా కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకోవడం కూడా గొప్ప విషయమే.

ఆ విషయంలో వైష్ణవి మళయాళ, ముంబై హీరోయిన్స్ కి ధీటుగా వస్తుంది. బేబీ క్రేజ్ తోనే వైష్ణవికి నాలుగైదు సినిమాల దాకా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. కెరీర్ లో మొదటి హిట్ తర్వాత అవకాశాలు రావడం కామనే కానీ ఆ ఛాన్స్ లతో కెరీర్ ని నిలబెట్టుకోవడం జరగాలి. అందుకే వైష్ణవి ఆచి తూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆశిష్ తో పాటుగా ఆనంద్ దేవరకొండ తో కూడా మరో సినిమా చేస్తుంది వైష్ణవి. ఆల్రెడీ హిట్ పెయిర్ కాబట్టి ఆ సినిమాకు సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఇదే కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. తప్పకుండా మిగతా తెలుగు హీరోయిన్స్ లా కాకుండా కచ్చితంగా స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక హీరోయిన్ కి రెమ్యునరేషన్ పెరిగింది అంటే ఆమె డిమాండ్ లో ఉన్నట్టే లెక్క. చాలా రోజుల తర్వాత తెలుగు హీరోయిన్ కోటి రెమ్యునరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే ఊపు కొనసాగితే మాత్రం వైష్ణవి తెలుగులో అదరగొట్టబోతుందని తెలుస్తుంది. వరుస 3 సినిమాలతో బిజీగా ఉన్న వైష్ణవి ఈ 3 సినిమాలతో కూడా హిట్ పడితే మాత్రం తన కెరీర్ గ్రాఫ్ పై పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.