Begin typing your search above and press return to search.

సితారతో బేబీ ఒప్పందం

బేబీ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ వైష్ణవి చైతన్య.

By:  Tupaki Desk   |   27 Sep 2023 12:30 PM GMT
సితారతో బేబీ ఒప్పందం
X

బేబీ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ వైష్ణవి చైతన్య. ఈ తెలుగమ్మాయి మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ కావడంతో పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ నుంచి వైష్ణవికి ఆఫర్స్ వస్తూ ఉండటం విశేషం. ఆమె నెక్స్ట్ సినిమాకి సంబందించిన అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు లేవు.

కానీ ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకుందంట. అలాగే దిల్ కూడా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వైష్ణవి చైతన్యని హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాలేదు. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ కూడా ఒక సినిమా కోసం వైష్ణవి చైతన్యని తీసుకునే ఆలోచనలో ఉన్నారంట.

ఇలా మూడు పెద్ద బ్యానర్స్ లో మూడు సినిమాలు చేయడానికి వైష్ణవి చైతన్య ఒప్పందం చేసుకోవడం నిజంగా తెలుగమ్మాయిలకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. గత రెండు దశాబ్దాల నుంచి చూసుకుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకొన్న అందాల భామలు ఒకరిద్దరు కనిపిస్తారు. వారు కూడా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు సొంతం చేసుకోలేకపోయారు.

అయితే వైష్ణవి చైతన్య ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోవడంతో పాటు పెద్ద సినిమాలలో అవకాశాలు సంపాదించేలా కనిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో కమిట్ అయిన మూవీ త్వరలో అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి బేబీ భామకి ఇంకెన్ని ప్రొడక్షన్ హౌస్ లో కొత్త సినిమాల కోసం క్యూ కడతాయో అనేది చూడాలి. ఈ పెద్ద బ్యానర్స్ లోనే కాకుండా సాయి రాజేష్ కూడా మరో మూడు చిత్రాలు వైష్ణవితో చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు గతంలోనే ప్రకటించారు. వాటిలో కొత్త సినిమా ఏదైనా స్టార్ట్ అవుతుందేమో చూడాలి.