Begin typing your search above and press return to search.

బేబీ నెక్స్ట్ చాలా టఫ్..!

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లు చేసిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వైష్ణవి లీడ్ రోల్ లో ఫస్ట్ టైం అయినా సరే ఆడియన్స్ ని మెప్పించింది.

By:  Tupaki Desk   |   24 July 2023 6:04 AM GMT
బేబీ నెక్స్ట్ చాలా టఫ్..!
X

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లు చేసిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వైష్ణవి లీడ్ రోల్ లో ఫస్ట్ టైం అయినా సరే ఆడియన్స్ ని మెప్పించింది. బేబీ సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ తనది. ఆ పాత్రకు వైష్ణవి చూపించిన అభినయం ఆడియన్స్ ని మెప్పించింది. ఇన్నాళ్లు యూట్యూబ్ హీరోయిన్ గా ఉన్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబోతుందని అంటున్నారు. అయితే బేబీ హిట్ పడింది ఇక నెక్స్ట్ వైష్ణవి ప్లాన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

ఒక హిట్ పడగానే హీరోకైనా హీరోయిన్ కి అయినా వరుస అరడజను ఛాన్స్ లు రావడం ఖాయం. ఈ క్రమంలో బేబీ వైష్ణవికి ఈపాటికే రెండు మూడు ఆఫర్లు వచ్చి ఉంటాయి. వైష్ణవి ఈ టైం లోనే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బేబీ హిట్ పడింది కదా అని అలాంటి పాత్రలనే చేయడం.. లేదంటే అసలేమాత్రం ప్రాధాన్యత లేని పాత్రల్లో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానంటే చేయడం లాంటిది చేస్తే ఆమె కెరీర్ రిస్క్ లో పడినట్టే. బేబీ లాంటి కథ మళ్లీ దొరకకపోవచ్చు. లేదంటే బేబీ కన్నా ఇంకో అద్భుతమైన కథ తన దగ్గరకు రావొచ్చు.

అందుకే ఒక హిట్ పడగానే వచ్చిన ప్రతి ఆఫర్ కి సైన్ చేయకుండా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తేనే వైష్ణవి కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా కొనసాగించే ఛాన్స్ ఉంది. లేదంటే మాత్రం ఆమె గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంటుంది. బేబీ తర్వాత వైష్ణవి చేసే సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ టైం లోనే వైష్ణవి తన తెలివితేటలు ప్రదర్శించాల్సి ఉంటుంది. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావు అంటూ ఒక టాక్ ఉంది. కానీ బేబీతో వైష్ణవి ఇచ్చిన స్పూర్తితో తప్పకుండా తెలుగు సినిమాల్లో ఇంకొంతమంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తారని చెప్పొచ్చు.

వైష్ణవికి ముందు యూట్యూబ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోకి ఇచ్చిన ఒకరిద్దరు భామలు ఇంకా కెరీర్ ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం కష్టపడుతున్నారు. కానీ వైష్ణవి కి ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలు వచ్చి తలుపు కొడుతున్నాయి. బేబీ తర్వాత వైష్ణవి ఎలాంటి సినిమాలు చేస్తుందో అదే ఆమె కెరీర్ గ్రాఫ్ ని డిసైడ్ చేస్తుంది.