Begin typing your search above and press return to search.

బేబి హీరోయిన్ వెంటప‌డ్డ యాంక‌ర్

ఆనంద్ దేవ‌ర‌కొండ స‌ర‌సన 'బేబి' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించింది వైష్ణ‌వి చైత‌న్య‌. త‌మిళంలో త‌ళా అజిత్ మూవీ 'వాలిమై'లోను న‌టించింది

By:  Tupaki Desk   |   2 April 2024 4:04 PM GMT
బేబి హీరోయిన్ వెంటప‌డ్డ యాంక‌ర్
X

ఆనంద్ దేవ‌ర‌కొండ స‌ర‌సన 'బేబి' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించింది వైష్ణ‌వి చైత‌న్య‌. త‌మిళంలో త‌ళా అజిత్ మూవీ 'వాలిమై'లోను న‌టించింది. అంత‌కుముందు యూట్యూబ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో పాపుల‌రైన వైష్ణ‌వికి 'బేబి' బిగ్ బ్రేకింగ్ పాయింట్.

సాయిరాజేష్ తెర‌కెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డ్ బ్రేకింగ్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర‌వాత బేబి పారితోషికం కూడా పెంచేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అదంతా అటుంచితే ఇప్పుడు బేబి కోసం ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ సుమ‌ వెంట‌ప‌డుతోంద‌ని స‌మాచారం. త‌న కుమారుడు రోష‌న్ న‌టించే రెండో సినిమాలో క‌థానాయిక‌గా బేబి వైష్ణ‌విని న‌టింప‌జేయాల‌నేది త‌న త‌ప‌న‌. దీనికోసం కోటి చెల్లించి అయినా ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

యాంక‌ర్ సుమ వార‌సుడు రోష‌న్ ఇటీవ‌లే హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. 'బబుల్ గ‌మ్' అనేది సినిమా టైటిల్. ఈ సినిమా ఆశించినంత ఆడ‌క‌పోయినా యూత్ లో రోష‌న్ కి మంచి గుర్తింపు ద‌క్కింది. అత‌డిని పెద్ద స్టార్ ని చేయాల‌ని సుమ త‌పిస్తోంది. దీనికోసం త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. బేబి అతడి స‌ర‌స‌న న‌టించేందుకు ఓకే చెప్పిందా లేదా? అన్న‌దానిపై అధికారిక స‌మాచారం అందాల్సి ఉంది.

త‌మిళంలోను ఫాలోయింగ్:

అజిత్ నటించిన 'వాలిమై' చిత్రంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య తన నటనతో తంబీల‌ అభిమానాన్ని చూరగొన్నారు. వైష్ణ‌వి చీర లుక్ తమిళనాడులో కూడా అభిమానులను తెచ్చింద‌ని టాక్ వినిపించింది. బేబి ఇత‌ర కెరీర్ విష‌యానికి వ‌స్తే.. వెబ్ సిరీస్‌లు, సినిమాల పనిలో బిజీగా ఉండటమే కాకుండా, తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ర‌న్ చేస్తోంది. 2020లో యూట్యూబ్‌లో ప్రసారమైన షణ్ముఖ్ జస్వంత్ వెబ్ సిరీస్ 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్‌లో ప్ర‌ధాన‌పాత్ర‌ పోషించిన తర్వాత వైష్ణ‌వి జనాల్లో ప్రజాదరణ పొందింది.

వరుస విజయాలతో ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. అల వైకుంఠపురముల్లు చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మెప్పించింది. గతంలో తెలుగు టిక్‌టోకర్‌గాను వైష్ణ‌వి పాపుల‌ర్. లఘు చిత్రాలలో కూడా ఈ బ్యూటీ నటించింది.