Begin typing your search above and press return to search.

బేబీ వైష్ణవి ముందు రెండు ఆప్షన్స్..!

యూట్యూబ్ సీరీస్ లతో మెప్పించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రమోట్ అవుతూ చేసిన తొలి ప్రయత్నం బేబీ

By:  Tupaki Desk   |   14 Aug 2023 5:30 PM GMT
బేబీ వైష్ణవి ముందు రెండు ఆప్షన్స్..!
X

అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సీరీస్ లతో మెప్పించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రమోట్ అవుతూ చేసిన తొలి ప్రయత్నం బేబీ. ఎస్.కె.ఎన్ నిర్మాణంలో సాయి రాజేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు ఏంటో అందరికీ తెలిసిందే. 7 కోట్ల బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా దాదాపు 70 కోట్ల పైన గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లకే కాదు హీరోయిన్ గా చేసిన వైష్ణవికి కూడా మంచి పేరు వచ్చింది.

ముఖ్యంగా ఎంత యూట్యూబ్ సీరీస్ ల అనుభవం ఉన్నా తొలి సినిమా అది కూడా మెయిన్ లీడ్ గా చాలా షేడ్స్ ఉన్న ఈ పాత్రను వైష్ణవి చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఈ సినిమాలో ఆమె చూపించిన అభినయం ఆమె కెరీర్ కి లైన్ క్లియర్ చేసింది. అయితే బేబీ హిట్ తో వైష్ణవికి చాలా మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఒక సినిమా హిట్ పడితే ఆ సినిమా హీరోకి హీరోయిన్ కి అవకాశాలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఈ టైం లోనే వైష్ణవి చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

వైష్ణవి చైతన్య ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంటెంట్ బేస్డ్ సినిమాలే చేస్తూ తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకోవడం.. లేదు రెగ్యులర్ హీరోయిన్స్ లా ఏ అవకాశాన్ని వదలకుండా చేస్తూ వెళ్లడం ఈ రెండిటిలో వైష్ణవి ఏ ఆప్షన్ ఎంచుకుంటుందో అలా ఆమె కెరీర్ కొనసాగుతుంది. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తా అని కూర్చున్నా కూడా ఒక్కోసారి మంచి ఛాన్స్ మిస్ అవ్వొచ్చు. రెగ్యులర్ అని కాకుండా సినిమాలో తన పాత్ర.. నిడివి.. వీటిని చూసుకుంటూ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వైష్ణవి స్టార్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

అసలే బేబీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ ఆమెను సహజ నటి జయసుధతో పోల్చారు. మరి ఆమెలా కెరీర్ కొనసాగించలేకపోతే ఎలా. ఒక హిట్ పడితే హీరోయిన్స్ కి పది రకాల ఆఫర్లు రావడం కామనే కానీ వాటిలో ఏది సరైన కథ.. ఏది తన కెరీర్ కి హెల్ప్ అవుతుంది అని తెలివిగా నిర్ణయం తీసుకుంటేనే వైష్ణవి కెరీర్ అనుకున్న విధంగా సాగుతుంది. బేబీ హిట్ సోలో హీరోయిన్ గా సూపర్ స్టార్ట్ ఇచ్చినా అన్ని బేబీ లాంటి కథలు సినిమాలే రావు కాబట్టి వైష్ణవి ఆచి తూచి అడుగులేస్తే బాగుంటుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.