Begin typing your search above and press return to search.

మరో లక్కీ ఛాన్స్ కు దగ్గరలో బేబీ?

రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, ఇందులో ఒక హీరోయిన్ గా వైష్ణవిని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట

By:  Tupaki Desk   |   3 Aug 2023 2:51 PM GMT
మరో లక్కీ ఛాన్స్ కు దగ్గరలో బేబీ?
X

ఈ మధ్యకాలంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బేబీ. చిన్న సినిమా వచ్చి, పెద్ద ప్రభంజనమో సృష్టించింది. అందుకే, ఎవరి నోట విన్నా, ఈ మూవీ పేరే వినపడుతోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. `క‌ల‌ర్ ఫొటో` సినిమాకు క‌థ అందించిన సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

బేబీ మూవీ గురించి అనే కంటే, వైష్ణవికి ఎక్కువ పేరు వచ్చింది. ఈ మూవీలో వైష్ణవి చైతన్య నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అందులోనూ ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కావడంతో మరింత ఎక్కువ పేరు తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే, ఈ సినిమా మొత్తం ఆమె తన భుజాలపై మోసింది. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు, సెలబ్రెటీలు సైతం ఫిదా అయిపోయారు..

అల్లు అర్జున్,చిరంజీవి అయితే, స్పెషల్ గా ఈవెంట్ పెట్టి మరీ ఆమెను మెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు ఈబ్యూటీ ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పక్కన నటించే అవకాశం వచ్చిందట.

రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, ఇందులో ఒక హీరోయిన్ గా వైష్ణవిని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. అయితే మొయిన్ హీరోయినా లేక, సెకండ్ హీరోయినా అనే విషయంపై ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతోంది.

అదే నిజమైతే వైష్ణవి ఫేట్ మారిపోయినట్లే. అయితే, పూరీ సినిమాలు అంటే, అమ్మాయిలను చాలా గ్లామర్ గా చూపిస్తాడు. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ విపరీతంగా ఒకరితో మరొకరు పోటీపడి గ్లామర్ ఒలకబోసారు. ఆ సినిమాకి సీక్వెన్స్ అంటే, వైష్ణవి కూడా వాళ్లలాగే చేయాల్సి ఉంటుంది. మరి వైష్ణవి అలా చేయగలదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

బేబీ మూవీలో వైష్ణవి మోడ్రన్ డ్రెస్సులో కనపడింది. కానీ, గ్లామర్ ఒలకపోయలేదు. మోడ్రన్ డ్రెస్ లలో కూడా పద్దతిగానే అనిపించింది. బోల్డ్ సీన్స్ లో చేసింది కానీ, మరీ బోల్డ్ గా చేయగలదా అనే అనుమానాలు ఎక్కువౌతున్నాయి. తెలుగు అమ్మాయి కాబట్టి, ఇక్కడి వారు మన అమ్మాయి అనే భావనతో చూశారు. కానీ, పాన్ ఇండియా సినిమా అంటే, ఆ రేంజ్ లో వైష్ణవి క్లిక్ అవుతుందా అనే డౌట్స్ కూడా లేకపోలేదు. అసలు నిజంగా ఆమెకు అందులో నటించే ఛాన్స్ వచ్చిందో లేదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.