Begin typing your search above and press return to search.

బేబీ బజ్.. మళ్ళీ షురూ

అయితే, అంత మంచి పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత కూడా వైష్ణవికి పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:30 PM GMT
బేబీ బజ్.. మళ్ళీ షురూ
X

బేబీ మూవీ, చిన్న సినిమా గా వచ్చి బాక్సాఫీసును షేక్ చేసేసింది. ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీతో ఆనంద్ దేవర కొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ విజయం సాధించడానికి వైష్ణవి చైతన్య ఒక కారణం. ఆ అమ్మాయి సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. దీంతో, తనకు చాలా మంచి పేరు వచ్చింది.

అయితే, అంత మంచి పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత కూడా వైష్ణవికి పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ, నిజానికి వైష్ణవికి ఆఫర్లు వస్తున్నాయట. తాజా సమాచారం ప్రకారం, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నల గడ్డ తాజా సినిమాలో వైష్ణవికి ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ఇంకా కన్ఫామ్ కాలేదు., కానీ చర్చలు మాత్రం జరుగుతూనే ఉన్నాయట.

ఇక, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అ్లలు శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే, ఈ మూవీలో కూడా వైష్ణవిని హీరోయిన్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సీక్వెన్స్ మూవీలోనూ వైష్ణవిని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వీర్ మూవీలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ విడుదల తర్వాత, ఆయన నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీలోనే వైష్ణవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక, బొమ్మరిల్లు భాస్కర్ తో అల్లు శిరీష్ మూవీ కి అయితే, రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు.

ఇప్పుడు వస్తున్న ఆఫర్లన్నీ, వైష్ణవి కెరీర్ కి బాగా ఉపయోగపడేవే. అన్ని మంచి దర్శక నిర్మాతల నుంచే వస్తున్నాయి. ఇక, బేబీ మూవీలో ఆమె కొంచెం నెగిటివ్ అయ్యింది. అయితే, ఆ నెగిటివిటీ మొత్తం పోయేలా ఈ సినిమా కథలు ఉంటాయని తెలుస్తోంది. చూడాలి, మరి వైష్ణవి కెరీర్ ఎలా సాగుతుందో.