వైష్ణవ్ వాటిని పట్టించుకోవట్లేదా..?
కథల ఎంపిక.. కాంబినేషన్ ఎంపిక.. ఏది లోపం అన్నది అతను తేల్చుకునేందుకే ఈ టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
By: Tupaki Desk | 29 Jun 2025 9:45 AM ISTఉప్పెన సినిమాతో తొలి సినిమానే సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత హిట్లు లేక కెరీర్ లో వెనకపడ్డాడు. ఉప్పెన వరకు ఓకే కానీ ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన 3 సినిమాలు మాత్రం డిజాస్టర్స్ అయ్యాయి. చివరగా వచ్చిన ఆది కేశవ సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్లింది. ఆ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి సినిమా అంటూ చేస్తే హిట్టు సబ్జెక్ట్ తోనే రావాలని ఫిక్స్ అయ్యాడు.
అందుకే కథల వేటలో ఉన్నాడు వైష్ణవ్ తేజ్. ఐతే వైష్ణవ్ కి ఈ గ్యాప్ లో రకరకాల న్యూస్ లు వస్తున్నాయి. కెరీర్ గ్యాప్ రిస్క్ అని తెలిసినా సరైన కథ దొరికే వరకు ఎవరేమి అనుకున్నా సరే తను వెయిట్ చేస్తానని గట్టిగా చెబుతున్నాడట వైష్ణవ్ తేజ్. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి నెక్స్ట్ సినిమాలు కూడా అదే పంథాలో ఆడతాయి అనుకుంటే ద్వితీయ విఘ్నం నుంచి వైష్ణవ్ తేజ్ కోలుకోలేకపోతున్నాడు.
కథల ఎంపిక.. కాంబినేషన్ ఎంపిక.. ఏది లోపం అన్నది అతను తేల్చుకునేందుకే ఈ టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఐతే ఈసారి కంటెంట్ పరంగా కూడా కొత్తగా ఉండేలా ఆడియన్స్ కి తప్పకుండా నచ్చే కథతో రావాలని చూస్తున్నాడట. అందుకే వైష్ణవ్ తేజ్ గ్యాప్ కి రీజన్ అవుతుందని అంటున్నారు.
వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది.. అది ఎలాంటి కథతో వస్తుంది అన్న ఆలోచనలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కూడా కెరీర్ స్ట్రగుల్స్ లో ఉన్నాడు. అతను కూడా సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అదే దారిలో వైష్ణవ్ తేజ్ కూడా మంచి కథ కోసమే టైం తీసుకుంటున్నాడట. మరి వైష్ణవ్ కి ఆ కథ ఎప్పుడు దొరుకుతుంది.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది చూడాలి.
మరోపక్క యువ హీరోలంతా కొత్త కథలతో అదరగొట్టేస్తున్నారు. సో వైష్ణవ్ కూడా న్యూ ఏజ్ సినిమాలతో అలరిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
