జాక్ బేబీ రొమాన్స్ పీక్స్ అనేలా ఉందే..!
జాక్ ట్రైలర్ లో కూడా వైష్ణవి చైతన్య లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. సినిమాలో అమ్మడు గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది.
By: Tupaki Desk | 5 April 2025 6:00 AM ISTబేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించిన వైష్ణవి చైతన్య యూట్యూబ్ వెబ్ సీరీస్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బేబీలో తన నటనతో ఇంప్రెస్ చేసిన అమ్మడు కమర్షియల్ గా కూడా తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఐతే బెబీ తర్వాత లవ్ మీ సినిమా చేసిన వైష్ణవి ఆ సినిమాతో షాక్ తిన్నది. లవ్ మీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం కాగా రెండో సినిమా రిజల్ట్ వైష్ణవిని డైలమాలో పడేసింది.
ఐతే ప్రస్తుతం అమ్మడు సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. మరో వారం రోజుల్లో జాక్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీదే అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. జాక్ సినిమాలో వైష్ణవి చైతన్య కాస్త రొమాంటిక్ గా కనిపిస్తుంది. జాక్ ప్రమోషనల్ కంటెంట్ అన్నిటిలో వైష్ణవి చైతన్య కొత్తగా కనిపిస్తుంది. సిద్ధు తో బేబీ రొమాన్స్ జాక్ సినిమాకే హైలెట్ అనిపించేలా ఉంటుందని టాక్.
జాక్ ట్రైలర్ లో కూడా వైష్ణవి చైతన్య లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. సినిమాలో అమ్మడు గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది. అంతేకాదు సిద్ధు, వైష్ణవి మధ్య రొమాన్స్ కూడా అదిరిపోయేలా ఉంది. సాధారణంగా తెలుగు అమ్మాయిలు ఇలా గ్లామర్ టచ్ ఇంకా రొమాంటిక్ పాత్రలో నటించడానికి వెనకడుగు వేస్తారు. కానీ వైష్ణవి చైతన్య మాత్రం జాక్ కోసం గ్లామర్ తో ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తుంది.
ఇక టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమా కాబట్టి జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో సిద్ధు యాక్షన్ మోడ్ లోకి వెళ్తున్నట్టు ఉన్నాడు. మరి జాక్ తో సిద్ధు తో పాటు వైష్ణవికి లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. సిద్ధు మాత్రం జాక్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ సినిమాగా జాక్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. టిల్లు పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధు ఆ రోల్ ని మర్చిపోయేలా జాక్ లో తన నటన కనబరుస్తాడా దాంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాడా అన్నది మరో వారం రోజుల్లో తెలుస్తుంది.
