బేబీ బ్యూటీ ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే షాకే!
బేబీ బ్యూటీ.. అదేనండీ వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.
By: Tupaki Desk | 6 April 2025 7:00 PM ISTబేబీ బ్యూటీ.. అదేనండీ వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ముద్దుగుమ్మ.. రీసెంట్ గా లవ్ మీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనుకున్నంత స్థాయిలో హిట్ దక్కలేదు. ఇప్పుడు పలు చిత్రాలతో బిజీగా ఉంది బ్యూటీ.
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన జాక్ మూవీతో మరో నాలుగు రోజుల్లో సందడి చేయనుంది వైష్ణవి చైతన్య. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాటిని ఇంకా పెంచేందుకు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
వైష్ణవి కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది. అదే సమయంలో రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. తన ఫస్ట్ క్రష్ హీరో రామ్ పోతినేని అని తెలిపింది వైష్ణవి. హీరోయిన్స్ విషయానికొస్తే.. అనుష్క, సాయి పల్లవి తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది.
అయితే తన ఫస్ట్ రెమ్యునరేషన్ రూ.3 వేలు అని చెప్పింది వైష్ణవి. సహజనటి జయసుధతో చిరంజీవి పోల్చడం జీవితంలో తనకు మర్చిపోలేని ప్రశంసట. 18 ఏళ్ల వయసులో ప్రేమలో పడిందట అమ్మడు. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది. కానీ తన ఫస్ట్ లవ్ ఇప్పటికీ ఎప్పటికీ సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పడం విశేషం.
బేబీ మూవీ తర్వాత ఆమెకు క్రేజ్ పెరగడమే కాదు.. అభిమానుల నుంచి ప్రపోజల్స్ బీభత్సంగా వచ్చాయని ఇంటర్వ్యూలో చెప్పింది వైష్ణవి. అంతే కాదు తాను అబ్బాయిల్లో మొదటగా కళ్లు, నవ్వు మాత్రమే గమనిస్తానని తెలిపింది. కూచిపూడి, పాశ్చాత్య నృత్యంలో వైష్ణవికి మంచి ప్రావీణ్యం ఉందట. పాటలు కూడా బాగా పాడుతుందట.
ఇక ఇప్పుడు జాక్ కాకుండా అన్ ఫినిష్డ్ మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అమ్మడు. బేబీ తర్వాత మరోసారి ఆనంద్ దేవరకొండతో జతకట్టిన వైష్ణవి.. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి అప్ కమింగ్ చిత్రాలతో బ్యూటీకి ఎలాంటి సక్సెస్ లు అందుతాయో చూడాలి.
