బేబీకి మళ్లీ బ్యాడ్ లక్..!
బేబీ సినిమాతో సక్సెస్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు అమ్మాయి స్టార్ ఇమేజ్ సంపాదించడం చాలా అరుదు.
By: Tupaki Desk | 10 April 2025 6:13 PM ISTబేబీ సినిమాతో సక్సెస్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు అమ్మాయి స్టార్ ఇమేజ్ సంపాదించడం చాలా అరుదు. అలాంటిది బేబీ సినిమాతోనే వైష్ణవికి మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందు అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించగా ఆ క్రేజ్ తోనే సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు అందుకుంది. బేబీ తో హీరోయిన్ గా చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ పడటంతో నెక్స్ట్ సినిమాల మీద అంచనాలు పెరిగాయి.
బేబీ తర్వాత లవ్ మీ సినిమాతో మరో ప్రయత్నం చేసింది అమ్మడు. ఆ సినిమా డిఫరెంట్ అటెంప్ట్ అయినా కూడా సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఒక సూపర్ హిట్ తర్వాత ఒక ఫ్లాప్ వైష్ణవికి షాక్ ఇచ్చింది. ఐతే తర్వాత కథల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేయాలని అనుకుంది. ఈలోగా టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ లో ఛాన్స్ పట్టేసింది అమ్మడు. ఆ సినిమా లో తన రోల్ మెప్పిస్తుందని చెప్పింది వైష్ణవి.
ఐతే నేడు రిలీజ్ అయిన సినిమా చూశాక వైష్ణవి కి మళ్లీ బ్యాడ్ లక్ తగిలిందని అనుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా జాక్. టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేసినా కూడా సినిమా ఫస్ట్ ఆటకే రిజల్ట్ ఏంటన్నది తెలిసింది. ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న వైష్ణవి చైతన్య కి మరోసారి నిరాశ తప్పలేదు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ సినిమాలో హీరోయిన్స్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. జాక్ సినిమా లో అసలు వైష్ణవి రోల్ కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు సరికదా ఆమె అసలు సినిమాలో ఎందుకు ఉందా అన్న డౌట్ వస్తుంది. ససినిమా మొత్తం సిద్ధు వన్ మ్యాన్ షో గా తెరకేక్కించగా అందులో కూడా సిద్ధు నటనలో టిల్లు అలా వచ్చి వెళ్లాడు. ఆల్రెడీ టిల్లుగా రెండు సినిమా ల్లో ఫుల్ ఎంటర్ టైన్ అయిన ఆడియన్స్ జాక్ లో కొత్త సిద్ధు ని చూస్తారని ఆశించగా అది జరగలేదు.
సిద్దు వైష్ణవి ఒక సూపర్ హిట్ పెయిర్ గా నిలుస్తారు అనుకుంటే జాక్ తో వీళ్ల జోడి ఆడియన్స్ ని అలరించడంలో సక్సెస్ కాలేదు. వైష్ణవి చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ తో అయినా పుంజుకుంటుందా లేదా అన్నది చూడాలి.
