ఉప్పెన జంటని ఎవరు కలపరేంటి..?
ఐతే అటు వైష్ణవ్ తేజ్ కి ఇటు కృతి శెట్టికి ఇప్పుడు ఒక అర్జెంట్ హిట్ కావాలి. అదేదో ఇద్దరు కలిసి చేసి మరో హిట్ కొట్టొచ్చు కదా అని సోషల్ మీడియాలో ఆడియన్స్ చర్చిస్తున్నారు.
By: Tupaki Desk | 31 May 2025 6:00 AM ISTతెర మీద హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరితే సినిమా అంత బాగా ఆడియన్స్ లోకి వెళ్తుంది. ఆ హీరో ఈ హీరోయిన్ జోడీ ఎంత బాగుందో ఆ ఇద్దరు కలిస్తే చాలు సినిమా హిట్టే అనేలా చెప్పుకుంటారు. ఐతే ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన హీరో, హీరోయిన్స్ కే కాదు తొలి సినిమాతోనే హిట్ పెయిర్ గా అనిపించుకున్న వారికి కూడా ఇలాంటి క్రేజ్ ఏర్పడుతుంది. అలాంటి వారి లిస్ట్ లో ఉన్నారు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, మంగుళూరు భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో ఈ ఇద్దరి జోడీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
మామూలుగా ప్రేమ కథలు చేస్తేనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అందులోనూ ఆ సినిమా సూపర్ బజ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆ జోడీకి మరింత క్రేజ్ ఏర్పడుతుంది. ఉప్పెన సినిమాతో వైష్ణవ్, కృతిల జంటకి కూడా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. బుచ్చి బాబు ఏ ముహుర్తాన ఈ ఇద్దరి జోడీ చేయాలని అనుకున్నాడో కానీ ఇద్దరి జంట సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. ఐతే ఉప్పెన సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చి బాబు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే సినిమా చేస్తున్నాడు.
పెద్ది అంటూ ఒక భారీ బడ్జెట్ సినిమా తో రాబోతున్నాడు బుచ్చి బాబు. ఆఫ్టర్ ఉప్పెన కృతి శెట్టి ఒక ఐదారు సినిమా ఛాన్స్ లు అందుకుంది. ఐతే వాటిలో ఏది ఆమె కెరీర్ గ్రాఫ్ పెంచేందుకు సహకరించలేదు. వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన తర్వాత చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఐతే అటు వైష్ణవ్ తేజ్ కి ఇటు కృతి శెట్టికి ఇప్పుడు ఒక అర్జెంట్ హిట్ కావాలి. అదేదో ఇద్దరు కలిసి చేసి మరో హిట్ కొట్టొచ్చు కదా అని సోషల్ మీడియాలో ఆడియన్స్ చర్చిస్తున్నారు.
నిజమే ఉప్పెనతో హిట్ పెయిర్ అనిపించుకున్న వైష్ణ, కృతి శెట్టి మళ్లీ కలిసి నటిస్తే తప్పకుండా ఈ కాంబోకి ఆడియన్స్ లో ఒక బజ్ ఏర్పడుతుంది. ఇక మళ్లీ కలిసి ఒక అందమైన ప్రేమ కథ చేస్తే మరో సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ. మరి ఎందుకు టాలీవుడ్ మేకర్స్ ఈ సూపర్ హిట్ జంటని కలపే ఆలోచన రావట్లేదు అన్నది తెలియట్లేదు. వైష్ణవ్ తేజ్, కృతి కలిసి నటిస్తే ఆ సినిమాకు పాజిటివ్ క్రేజ్ వస్తుంది. ఇక కథ కథనాలు కాస్త యూత్ కి నచ్చే అంశాలు ఉంటే వాళ్లు కోరుకునే సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది.
