Begin typing your search above and press return to search.

నెటిజన్లకు వడివేలు కౌంటర్.. అమెరికా నుంచి ఏం రాలేదంటూ..!

భారీ వర్షాల కారణంగా కొద్దిరోజులుగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:47 PM GMT
నెటిజన్లకు వడివేలు కౌంటర్.. అమెరికా నుంచి ఏం రాలేదంటూ..!
X

భారీ వర్షాల కారణంగా కొద్దిరోజులుగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఏరియాల్లో అయితే వర్ష ప్రభావం వరద నీరు వల్ల చాలా ఆస్తి నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగిస్తుంది. అయితే తూత్తుకుడి, నెల్లైలోని లోతట్టు ప్రదేశాల్లో సహాయక చర్యలు జరుగుతుండగా అందులో దర్శకుడు మారి సెల్వరాజ్ పాల్గొన్నారు. మంత్రి తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన చూశారు.

అదే టైం లో బాధితులకు తన సహాయం అందించారు. అయితే మారి సెల్వరాజ్ ఇలా చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ఏ పనిచేసినా సరే దాని వెనుక ఉన్న మంచిని కాకుండా అందులో తప్పులను ఎలా పసిగట్టాలా అని చూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ సహాయక చర్యల్లో పాల్గొనడాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి.

మారి సెల్వరాజ్ పై నెటిజన్లు చేస్తున్న విమర్శలపై స్టార్ కమెడియన్ వడివేలు ఫైర్ అయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్న మారి సెల్వరాజ్ ని అభినందించడం మానేసి అతను ఎందుకు పాల్గొన్నాడు అని ప్రశ్నించడం ఏమి బాగాలేదని అన్నారు. తూత్తుకుడి ఆయన సొంత ఊరు ఆ ప్రాంతంలో ఎక్కడ ఏముంది అన్న విషయం అతనికి తెలుసు. అందుకే ఆయన మంత్రితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అతను అమెరికా నుంచి ఏమైనా వచ్చారా అంటూ కామెంట్ చేశారు.

ఒకవేళ నా సొంతూరులో వరదలు వస్తే నేను కాకుండా ఇంకెవరు వెళ్తారు అంటూ ప్రశ్నిస్తూనే నెటిజన్లనకు చీవాట్లు పెట్టారు వడివేలు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు కలిసి మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో మామన్నన్ సినిమాలో నటించారు. అంతకుముందు మారి సెల్వరాజ్ పరియేరుం పెరుమాళ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కర్ణన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరిగా క్రేజ్ తెచ్చుకున్నారు.