రీఎంట్రీకి రెడీ అయిన అలనాటి హీరో.. కాకపోతే ..
వరుస సినిమాలతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్ 28 సినిమాల్లో హీరోగా నటించి ఎంత వేగంగా కెరీర్లో పైకి ఎదిగారో అంతే వేగంగా ఫేడవుట్ అయ్యారు.
By: Tupaki Desk | 11 July 2025 3:29 PM ISTఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. అందుకే క్రేజ్ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. స్టార్‌డమ్ ఉన్నప్పుడే దాన్ని ఎంజాయ్ చేయాలి. అలా వచ్చిన క్రేజ్, మార్కెట్ ను సరిగా పట్టించుకోకుండా ఉంటే తర్వాత ఎందుకు జాగ్రత్త పడలేదా అని బాధపడటం ఖాయం. ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ హీరో గా ఉన్న వడ్డే నవీన్ విషయంలో ఇదే జరిగింది.
90స్ లో వడ్డే నవీన్ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపారు. కోరుకున్న ప్రియుడు సినిమాతో ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ తర్వాత చేసిన పెళ్లి మూవీతో మంచి హిట్ అందుకుని తన గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకున్నారు. పెళ్లి సినిమాతో నవీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత చాలా బాగుంది, మనసిచ్చి చూడు, చెప్పాలని ఉంది, ప్రేమించే మనసు, స్నేహితులు సినిమాలతో ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు.
వరుస సినిమాలతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్ 28 సినిమాల్లో హీరోగా నటించి ఎంత వేగంగా కెరీర్లో పైకి ఎదిగారో అంతే వేగంగా ఫేడవుట్ అయ్యారు. ఆయన్నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా ఎటాక్. అది కూడా 2016లో. ఆ తర్వాత ఆయన మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ నవీన్ విలన్ గా రీఎంట్రీ ఇస్తారని ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి.
కానీ వడ్డే నవీన్ రీఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. అయితే ఇప్పుడు వడ్డే నవీన్ మరోసారి వార్తల్లోకెక్కారు. వడ్డీ నవీన్ మరోసారి ఇండస్ట్రీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. వడ్డే క్రియేషన్స్ పేరిట ఆయనో నిర్మాణ సంస్థను మొదలుపెట్టినట్టు సమాచారం. నవీన్ మళ్లీ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తారనుకుంటే ఆయన మాత్రం నిర్మాతగా రీఎంట్రీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని అంటున్నారు. మరి చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న నవీన్ నిర్మాతగా ఎలాంటి సినిమాలను ఆడియన్స్ కు అందిస్తారో చూడాలి.
