Begin typing your search above and press return to search.

ద‌శాబ్దం త‌ర్వాత కంబ్యాక్ క‌లిసొచ్చేనా?

స్టోరీ...స్క్రీన్ ప్లే కూడా లో న‌వీన్ ఇన్వాల్వ్ అయిన నేప‌థ్యంలో కంబ్యాక్ ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   10 Aug 2025 10:48 AM IST
ద‌శాబ్దం త‌ర్వాత కంబ్యాక్ క‌లిసొచ్చేనా?
X

వ‌డ్డే న‌వీన్ పాత జ‌న‌రేష‌న్ కి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `పెళ్లి`, `మ‌న‌సిచ్చి చూడు` లాంటి చిత్రాల‌తో అప్ప‌ట్లో ఓ వెలుగు వెలిగారు. ఇండ‌స్ట్రీలో శ్రీకాంత్, జ‌గ‌ప‌తి బాబు త‌ర‌హాలో మంచి స‌క్సెస్ అందుకున్న వారే. న‌టుడిగా 25-30 సినిమాల వ‌ర‌కూ చేసారు. కానీ ఎంతో కాలం కెరీర్ ని కొన‌సాగించ‌లేదు. తండ్రి పెద్ద నిర్మాత అయినా? న‌వీన్ మాత్రం త‌ర్వాత కాలంలో సినిమాల మీద ఆస‌క్తి చూపించ‌లేదు. 2010 త‌ర్వాత సినిమాల‌కు భారీ గ్యాప్ వ‌చ్చింది. అదే ఏడాది `ఆంటీ అంకుల్ నంద గోపాల్`, ` శ్రీమతి క‌ళ్యాణం` సినిమాలు చేసారు.

అటుపై ఆరేళ్ల‌కు `ఎటాక్` అనే చిత్రంలో న‌టించారు. ఆ త‌ర్వాత న‌వీన్ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాలు చేయ‌లేదు. మీడియాలో క‌నిపించ‌డం చాలా రేర్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే న‌టుడు కాదు. తాజాగా న‌వీన్ ద‌శాబ్దం త‌ర్వాత కంబ్యాక్ అవ్వ‌డం అన్న‌ది ఆస‌క్తి క‌రంగా మారింది. `ట్రాన్స‌ప‌ర్ త్రిమూర్తులు` అనే సినిమాలో రీలాంచ్ అవుతున్నారు. ఈసినిమాలో తానే హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ తో పాటు క‌థ‌, క‌థ‌నంలో కూడా న‌వీన్ భాగ‌మ‌వ్వ‌డం విశేషం.

ఇందులో న‌వీన్ కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఆపాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. న‌వీన్ లుక్ ప‌రంగా ఎలాంటి మార్పులు రాలేదు. ఒక‌ప్ప‌టి న‌వీన్ ని చూస్తున్న‌ట్లే ఉంది. సాధా ర‌ణంగా ఇండ‌స్ట్రీకి న‌టులు దూర‌మైన త‌ర్వాత లుక్ ప‌రంగా చాలా మార్పులొస్తుంటాయి. పాత రూపాన్ని ..శ‌రీర సౌష్ట‌వాన్ని కోల్పోతుంటారు. కానీ న‌వీన్ మాత్రం ఇప్ప‌టికీ అదే లుక్ మెయింటెన్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆహార్యంలో ఆక‌ట్టుకుంటున్నాడు.

స్టోరీ...స్క్రీన్ ప్లే కూడా లో న‌వీన్ ఇన్వాల్వ్ అయిన నేప‌థ్యంలో కంబ్యాక్ ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లే క‌నిపిస్తుంది. మ‌రి రీ లాంచ్ అన్న‌ది అత‌డికి ఎంత వ‌ర‌కూ క‌లిసొస్తుందో చూడాలి. ఈ మ‌ధ్య కాలంలో గ్యాప్ ఇచ్చిన న‌టులు కూడా రీలాంచ్ లో బాగానే స‌క్సెస్ అవుతున్నారు. బాలీవుడ్ న‌టుడు బాబి డియోల్ రీలాంచ్ లో టాలీవుడ్ లో అలాగే క‌లిసొచ్చింది. `యానిమ‌ల్` లో అబ్రార్ పాత్ర అత‌డి సినీ జీవితాన్నే మార్చేసిన సంగ‌తి తెలిసిందే. న‌వీన్ కెరీర్ కూడా అలాంటి ట‌ర్నింగ్ తీసుకుంటుందా? అన్న‌ది చూడాలి.