Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వార్ ట్రైలర్​.. ఎలా ఉందంటే!

అయితే ఇప్పుడు 'ది వ్యాక్సిన్ వార్' ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. హిందీ వెర్షన్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 2:24 PM GMT
వ్యాక్సిన్ వార్ ట్రైలర్​.. ఎలా ఉందంటే!
X

ది కశ్మీర్ ఫైల్స్​ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్.. వివేక్ అగ్ని హోత్రీ. అలాగే వివాదస్పద చర్యలతో, కామెంట్లతో ఎప్పుడూ మీడియాలో హాట్​ టాపిక్​గా మారుతుంటారు. అయితే కశ్మీర్ ఫైల్స్ లాంటి భారీ సెక్సెస్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడీ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తాజాగా మూవీటీమ్​ ట్రైలర్​ను రిలీజ్ చేసింది.


కరోనా మహమ్మారి ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిన విషయమే. లక్షల మంది చనిపోయారు. అయితే ఎట్టకేలకు చివరకు వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసి ఈ మారణహోమాన్ని ఆపారు. అయితే ఈ కోవాక్సిన్ అభివృద్ధిపై ట్రూ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అగ్నిహోత్రి. మెడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి బయో సైన్స్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఇప్పుడు 'ది వ్యాక్సిన్ వార్' ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. హిందీ వెర్షన్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు భారతీయ వైజ్ఞానిక సంఘం చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యలు, చివరికి ఎలా విజయం సాధించారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్​ను కట్​ చేశారు. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి వెనక భారతీయ మెడికల్ సైంటిస్ట్​లు చేసిన కృషిని తెలియజేసేందుకు ప్రయత్నించారు.

ముందుగా భారతీయ సైంటిస్టుల దగ్గర రీసెర్చ్ కోసం కనీసం రూ.1 లక్ష కూడా లేవంటా కదా అని నానా పటేకర్ చెప్పే డైలాగ్​తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో.. సరైన వనరులు, పెట్టుబడి లేకపోయినా కూడా మన భారతీయ సైంటిస్టులు కొవిడ్ వ్యాక్సిన్ కనుక్కోవాలని బలంగా ఎలా నిర్ణయించుకున్నారు, అందుకు తగినట్టుగా ఎలా ముందుకు సాగారు? ఆ సమయంలో వారు మీడియా, ప్రజల నుంచి ఎదుర్కొన్న విమర్శలు వంటివి కూడా చూపించారు. ఈ పరిశోధనల్లో.. కేవలం మగవారు మాత్రమే కాదు.. ఆడవారు కూడా ఎంత కష్టపడ్డారో బాగా చూపించారు.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.