Begin typing your search above and press return to search.

2023-24 అన్ని లెక్క‌లు స‌రిచేసేలా హీరోయిన్!

త‌న నుంచి రాబోతున్న సినిమాల గురించి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రి చెప్పిందంటే? ఎంత క‌సిగా ఎదురు చూస్తుందో గెస్ చేయోచ్చు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 2:30 PM GMT
2023-24 అన్ని లెక్క‌లు స‌రిచేసేలా హీరోయిన్!
X

'శంషేరా' ప్లాప్ త‌ర్వాత వాణీ క‌పూర్ మ‌ళ్లీ బాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. భారీ బ‌డ్జెట్ తో 2022 లో రిలీజ్ అయిన ఆ సినిమా కేవ‌లం 60 కోట్లు వ‌సూళ్లు తేవ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా కెరీర్ లో మ‌రో ప్లాప్ చిత్రంగా మారింది. ర‌ణ‌బీర్ క‌పూర్..సంజ‌య్ ద‌త్ లు వారి వారి సినిమాలో బిజీ అయిన‌ప్ప‌టికీ వాణీ క‌పూర్ మాత్రం అడ్డంగా బుక్కైంది. అప్ప‌టికే అమ్మ‌డి కెరీర్ న‌త్త న‌డ‌క‌న సాగుతుంది. ఏడాది కో సినిమాచొప్పున క‌మిట్ వాటితో బండి నెట్టుకుంటూ వ‌స్తోంది.


స‌రిగ్గా అదే స‌మ‌యంలో శంషేరా ప్లాప్ తో వ‌చ్చే అవ‌కాశాలు కూడా రావ‌డం మానేసాయి. దీంతో క‌పూర్ బ్యూటీ గ‌త ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేక‌పోయింది. అయితే అదే ఏడాది కొత్త సిన‌మాలు మాత్రం బాగానే క‌మిట్ అయిన‌ట్లు తాజాగా అమ్మ‌డి లైన‌ప్ చూస్తుంటే తెలుస్తోంది. 2023 లో రాక‌పోయినా గ‌త ఏడాది ..ఈ ఏడాది కి స‌రిప‌డ్డ అన్ని సినిమాలతో ఇప్పుడు వ‌చ్చేస్తాను అంటూ రెడీ అవుతుంది.

త‌న నుంచి రాబోతున్న సినిమాల గురించి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రి చెప్పిందంటే? ఎంత క‌సిగా ఎదురు చూస్తుందో గెస్ చేయోచ్చు. 'నానుంచి రాబోయే చిత్రాల కోసం ఎంతో థ్రిల్లింగ్ గా ఎదురు చూస్తున్నా. త్వ‌ర‌లో నాలుగు భిన్న‌మైన సినిమాలో మీ ముందుకు రాబోతున్నా. అజ‌య్ దేవ‌గ‌ణ్ తో క‌లిసి 'రెయిడ్ -2' లో న‌టిస్తున్నా. ఇది నా కెరీర్ లో మైలురాయిలో నిలిచిపోతుంద‌ని భావిస్తున్నా. అలాగే సోనాలీ ర‌త‌న్ తెర‌కెక్కిస్తోన్న 'స‌ర్వ‌గుణ్ సంప‌న్' లో న‌టిస్తున్నా. త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న చిత్రంలో స‌వాల్ తో కూడిన పాత్ర‌లో క‌నిపిస్తా.

అలాగే 'మండాల మ‌ర్డ‌ర్స్ 'తో ఓటీటీలోకి అడుగు పెడుతున్నా. న‌టిగా నాలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. నన్ను మీరెంత మెచ్చుకుంటారో? చూడాల‌ని ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నా. వీటితో పాటు మ‌రో గొప్ప సినిమాలో న‌టిస్తున్నా. ఆవివ‌రాలు త్వ‌ర‌లో చెబుతా' అంది. మొత్తానికి అమ్మ‌డు 2024 లో మాత్రం అభిమానుల కోసం భారీగానే ట్రీట్ రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.