Begin typing your search above and press return to search.

సక్సెస్ కోసం బోల్డ్‌ కంటెంట్‌ తో ముద్దుగుమ్మ...!

ఇప్పుడు మరిన్ని ఆఫర్ల కోసం ఈ అమ్మడు బోల్డ్‌ కంటెంట్ ను ఎంపిక చేసుకుంది

By:  Tupaki Desk   |   29 July 2023 7:15 AM GMT
సక్సెస్ కోసం బోల్డ్‌ కంటెంట్‌ తో ముద్దుగుమ్మ...!
X

2013 సంవత్సరంలో వాణి కపూర్‌ హిందీ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఆహా కళ్యాణం సినిమాను నానితో కలిసి చేసింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా కెరీర్‌ ఆరంభంలో వరుస సినిమాలు నిరాశ పరిచితే కెరీర్ ఖతం అయినట్లే. కానీ వాణీ కపూర్ కి లక్ కలిసి వచ్చింది.

2019 సంవత్సరంలో వచ్చిన వార్‌ తో ఈ అమ్మడికి మొదటి సక్సెస్ పడింది. ఆ సినిమా తో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. పాపం ఈ అమ్మడికి ఆఫర్లు రావడమే గగనంగా మారింది. సిరీస్ ల్లో అందాల విందు చేయడం.. ఫోటో షూట్స్ లో స్కిన్‌ షో చేయడం వల్ల ఈమె రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తోంది.

ఇప్పుడు మరిన్ని ఆఫర్ల కోసం ఈ అమ్మడు బోల్డ్‌ కంటెంట్ ను ఎంపిక చేసుకుంది. హిందీలో ఈమె సర్వగుణ సంపన్న అనే సినిమాలో కనిపించబోతుంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఆమె సన్నిహితులు బలంగా చెబుతున్నారు.

సర్వగుణ సంపన్న సినిమాలో వాణీ కపూర్‌ ఒక పోర్న్‌ స్టార్‌ పోలికలతో ఉన్న అమ్మాయిగా కనిపించబోతుంది. పోర్న్‌ స్టార్‌ పోలికలతో ఉండటం వల్ల హీరోయిన్‌ ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

మొత్తానికి ఇది ఒక బోల్డ్‌ కంటెంట్‌ మూవీ అంటూ నేపథ్యం వింటేనే క్లారిటీ వస్తుంది. ముందు ముందు ఈ సినిమా మంచి బజ్ ను క్రియేట్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా తో వాణి కపూర్ కు బ్రేక్‌ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా తో పాటు ఓటీటీ కోసం మరో సినిమాను కూడా ఈమె చేస్తుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పదేళ్లకు ఈ అమ్మడు బిజీ అవ్వడం విడ్డూరంగా ఉంది కదా...!