Begin typing your search above and press return to search.

వాణీ క‌పూర్ స్ట‌న్నింగ్ ఫోజ్ వైర‌ల్

సినిమాలు ఓవైపు ప్ర‌క‌ట‌న‌లు మ‌రోవైపు.. ఫోటోషూట్లు ఇంకోవైపు.. వాణీక‌పూర్ షెడ్యూల్స్ ఠ‌ఫ్ బిజీ. సోష‌ల్ మీడియాల్లోను నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   20 May 2025 3:00 AM IST
వాణీ క‌పూర్ స్ట‌న్నింగ్ ఫోజ్ వైర‌ల్
X

నాని స‌ర‌స‌న ఆహా క‌ళ్యాణం చిత్రంలో న‌టించింది వాణీ క‌పూర్. టాలీవుడ్ డెబ్యూ సినిమా ఫ్లాపైనా, బాలీవుడ్ లో హృతిక్ స‌ర‌స‌న `వార్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించింది. వార్ ఈ సినిమా కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన సినిమా. ఇటీవ‌ల వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది.


వాణి ఇంత‌కుముందు పాకిస్తానీ న‌టుడు ఫ‌వాద్ స‌ర‌స‌న‌ `అబిర్ గులాల్` అనే రొమాంటిక్ డ్రామాలో న‌టించింది. క్రాస్ క‌ల్చ‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జాన‌ర్ లో రూపొందింది. `అబిర్ గులాల్` 2025 చివ‌రిలో విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం సాగినా, ఇండియా- పాక్ వార్ నేప‌థ్యంలో ఈ సినిమాకి తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని అంతా భావిస్తున్నారు.


సినిమాలు ఓవైపు ప్ర‌క‌ట‌న‌లు మ‌రోవైపు.. ఫోటోషూట్లు ఇంకోవైపు.. వాణీక‌పూర్ షెడ్యూల్స్ ఠ‌ఫ్ బిజీ. సోష‌ల్ మీడియాల్లోను నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఈ భామ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. వాణీ క‌పూర్ చీటా ఫ్రాక్ మిరుమిట్లు కుర్ర‌కారును ఒక రేంజులో వేడెక్కించింది. అందాల భామ థై స్లిట్ ఎలివేష‌న్ గుబులు రేపుతోంది. వాణీ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. వాణీ త‌దుప‌రి బాడ్త‌మీజ్ గిల్, స‌ర్వ‌గుణ సంప‌న్న అనే రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటికి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.