పిక్‌టాక్ : 'వార్' బ్యూటీ హొయలు చూశారా!
తెలుగులో నాని హీరోగా నటించిన 'ఆహా కళ్యాణం' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ వాణి కపూర్.
By: Tupaki Desk | 11 April 2025 8:45 AM ISTతెలుగులో నాని హీరోగా నటించిన 'ఆహా కళ్యాణం' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ వాణి కపూర్. సినిమా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన చాలా కాలం తర్వాత బ్రేక్ దక్కింది. 2013లో శుద్ధ దేశీ రొమాన్స్ సినిమాతో ఇండస్ట్రీలో నటిగా అడుగు పెట్టిన వాణి కపూర్ ఆ తర్వాత చేసిన ఆహా కళ్యాణం, బేఫికర్ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో దాదాపు అయిదు సంవత్సరాలు హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ అమ్మడికి హృతిక్ రోషన్ 'వార్' సినిమాలో నటించే అవకాశం దక్కిందో అప్పుడే ఈ అమ్మడి ఫేట్ మారిపోయింది. బాలీవుడ్‌లో వార్ సినిమా ఈమెకు బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
వార్ సినిమా తర్వాత వాణి కపూర్ బాలీవుడ్‌లో 2021లో బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు సైతం వాణి కపూర్ క్రేజ్‌ను పెంచాయి. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఉండటంతో ఈ అమ్మడి క్రేజ్ పెరుగుతూ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈమె నటించిన రైడ్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విజయంపై వాణి కపూర్ చాలా నమ్మకంగా కనిపిస్తుంది.
సినిమాల్లో ఈ మధ్య కాలంలో చాలా బిజీ అయిన వాణి కపూర్ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు దాదాపుగా 80 లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తన ఫాలోవర్స్‌ని ఎంటర్ టైన్ చేయడం కోసం వాణికపూర్ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడంతో పాటు, రెగ్యులర్ సినిమా అప్‌డేట్స్, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పటిలాగే ఈసారి కూడా అందంతో ఆకట్టుకుంది.
లాంగ్ ఫ్రాక్‌లో సింపుల్ మేకోవర్‌తో, లూజ్ హెయిర్ స్టైల్‌తో సింప్లీ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందగత్తెకు చాలా ఆలస్యంగా ఆఫర్లు వస్తున్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వాణి కపూర్ వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల్లో రైడ్ 2 తో పాటు మరో రెండు లేదా మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాణీ కపూర్ మరోసారి సౌత్ సినిమాల్లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. మరి వాణి కపూర్ సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.
