మిల్కీ బ్యూటీ లా లేదని హీరోయిన్ కు ఉద్వాసన!
బాలీవుడ్ నటి వాణీ కపూర్ `శుద్దీ దేశ్ రొమాన్స్` తో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2025 1:13 PM ISTబాలీవుడ్ నటి వాణీ కపూర్ 'శుద్దీ దేశ్ రొమాన్స్' తో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అమ్మడి కెరీర్ ప్రారంభమై నేటికి 12 ఏళ్లు అయినా హీరోయిన్ గామాత్రం ఇంకా స్టార్ హోదాలో చేరలేదు. 12 ఏళ్ల కెరీర్ లో ఏడెనిమిది సినిమాలే చేసింది. కెరీర్ పరంగా చూస్తే నత్తడనకే సాగుతోంది. వచ్చిన అవకాశాలు సద్వి నియోగం చేసుకుంటున్నా? స్టార్ హీరోలతో అవకాశాలు మాత్రం అరుదుగానే అందుకుంటోంది. అలాగని అవకాశాలకు పూర్తిగా దూరం లేదు. చేతిలో కొన్ని కమిట్ మెంట్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు వెబ్ సిరీస్ వరల్డ్ లోకి అడుగు పెడుతోంది. 'మండలా మర్డర్స్' సిరీస్ తో డిటెక్టివ్ గా నిందితుల్ని పరుగులు పెట్టించడానికి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా వాణీ కపూర్ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను చాలా సన్నగా ఉన్నానని, బరువు పెరగమని అంతా అంటుంటారు. కానీ నన్ను నేను ఇలాగే ఇష్టపడతాను. నా శరీరంలో ఎలాంటి మార్పులు చేయాల నుకోవడం లేదు. ఇలా ఆరోగ్యంగా..ఫిట్ గా ఉన్నాను. సన్నగా ఉన్నవ్ అని ఎవరు అన్నా పీల్ అవ్వను.
ఎందుకంటే సవాళ్లు నాకు కొత్తేం కాదు. బాలీవుడ్ లో పేరు సంపాదించడం అంత సులభం కాదు. కొత్త వారు కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సిందే. నా ప్రయాణం ఆరంభం నుంచి సజావుగా సాగలేదు. పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నాను. దానికి ట్యాలెంట్ ఉంటే సరిపోతుదనుకున్నా. కానీ ప్రతిభతో పాటు అందం కూడా చాలా అవసరమని ఆలస్యంగా తెలుసుకున్నాను. కెరీర్ ఆరంభంలో ఓ డైరెక్టర్ నన్ను తిరస్కరించాడు. ఆ విషయం నాకు నేరుగా చెప్పలేదు.
ఆ సినిమాలో పాత్రకు నేను న్యాయం చేయలేనని, నా శరీరం రంగు మిల్కీ వైట్ కాదని అన్నారుట. ఆ కారణంగానే ప్రాజెక్ట్ నుంచి తిరస్కరించినట్లు తెలిసింది. అప్పుడే అర్దమైంది ట్యాలెంట్ ఒక్కటే సరిపో దు...రూపం..శరీరానికి రంగు కూడా అంతే ముఖ్యమని. కానీ ఇది అన్ని వేళలా పనిచేస్తుందని మాత్రం నమ్మను. దర్శక, నిర్మాతలంతా ఒకేలా ఎలా ఆలోచిస్తారు? వాళ్ల అభిప్రాయాలు అందుకు భిన్నంగా భిన్నంగా ఉండే అవకాశం లేకపోలేదని` తెలిపింది.
