Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ కి యూవీ వారి బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

చిరు బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్ కి యూవీ వారు సర్ ప్రైజ్‌ గా ప్రీ లుక్ పోస్టర్ ను రివీల్‌ చేశారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:51 AM GMT
మెగా ఫ్యాన్స్ కి యూవీ వారి బర్త్‌ డే సర్‌ప్రైజ్‌
X

నేడు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమా అప్‌డేట్‌ వచ్చింది. గత కొన్నాళ్లుగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మెగా హీరో సినిమా రాబోతుందనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు మెగాస్టార్‌ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో సినిమా రాబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. చిరు బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్ కి యూవీ వారు సర్ ప్రైజ్‌ గా ప్రీ లుక్ పోస్టర్ ను రివీల్‌ చేశారు.


పోస్టర్ లో గుహలో తేలు ఉండటంతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్‌ అన్నట్లుగా ఉంది. ఈ పోస్టర్‌ ను చూస్తూ ఉంటే చిరంజీవికి సరైన సమయంలో ఓ సాలిడ్ సక్సెస్ పడబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. దర్శకుడు ఎవరు, ఇతర విషయాలు ఏంటి అనేది అతి త్వరలోనే తెలియజేయబోతున్నట్లుగా యూవీ క్రియేషన్స్ వారు ప్రకటించారు.

నేడు మరో పోస్టర్ ను కూడా యూవీ క్రియేషన్స్‌ వారు విడుదల చేయబోతున్నారు. ఉదయం 10.53 గంటలకు మరో పోస్టర్‌ ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఆ పోస్టర్ లో అన్ని విషయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీస్ గా నిలిచాయి.

అందుకే చిరంజీవి తో యూవీ వారు నిర్మించబోతున్న సినిమాపై ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా చాలా నమ్మకం పెట్టుకోవచ్చు. మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా యూవీ వారు ఇచ్చిన ఈ సర్‌ ప్రైజ్ అన్నింటికంటే బెస్ట్‌ అన్నట్లుగా కొందరు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ దర్శకుడు ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.