Begin typing your search above and press return to search.

డిఫరెంట్ సినిమాలతో UV మ్యాజిక్.. రాబోయే రోజుల్లో గట్టిగానే..

యూవీ క్రియేషన్స్.. వి సెల్యులూయిడ్ బ్యానర్ పై గామి, ఓం భీమ్ బుష్ ఇచ్చిన సక్సెస్ జోష్ తో మరిన్ని సినిమాలను త్వరలోనే ప్రకటించనుంది.

By:  Tupaki Desk   |   31 March 2024 8:47 AM GMT
డిఫరెంట్ సినిమాలతో UV మ్యాజిక్.. రాబోయే రోజుల్లో గట్టిగానే..
X

గామి, ఓం భీమ్ బుష్.. ఇటీవల రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు చిత్రాల కాన్సెప్ట్స్ బాగా క్లిక్ అయ్యాయి. కంటెంట్ ఉంటే చాలు.. సినిమా దూసుకుపోవడం పక్కా అని మరోసారి నిరూపించాయి. ఈ చిత్రాలు రెండూ ఒకే నెలలో రిలీజ్ అయ్యి.. మేకర్స్ కు మంచి లాభాలు కురిపించాయి. ఆయా నటీనటులకు మంచి హిట్లను అందించాయి.

అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించిందీ ఒకే నిర్మాణ సంస్థ కావడం గమనార్హం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ వి సెల్యులాయిడ్ బ్యానర్ పై గామి, ఓం భీమ్ బుష్ రిలీజ్ అయ్యాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో రెండు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తో మంచి హిట్లు అందుకుంది యూవీ క్రియేషన్స్ సంస్థ.

బడా స్టార్లతో భారీ సినిమాలు నిర్మించే యూవీ క్రియేషన్స్.. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలతో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రూపొందిస్తోంది. మిగతా సంస్థలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతోంది. చాలా తక్కువ సంస్థలు మాత్రమే యంగ్ డైరెక్టర్లు, మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తాయి. అలాంటిది ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్డాగా మారింది యూవీ సంస్థ.

యూవీ క్రియేషన్స్.. వి సెల్యులూయిడ్ బ్యానర్ పై గామి, ఓం భీమ్ బుష్ ఇచ్చిన సక్సెస్ జోష్ తో మరిన్ని సినిమాలను త్వరలోనే ప్రకటించనుంది. కొత్త కాన్సెప్టులతో పలు మూవీలను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. కొత్త నటీనటులను, దర్శకులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరి భవిష్యత్తులో యూవీ సంస్థ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

యూవీ క్రియేషన్స్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన స్నేహితులు వంశీ, ప్రమోద్, విక్రమ్ కలిసి ఈ బ్యానర్‌ ను స్థాపించారు. ఇందులో ప్రభాస్‌ కు కూడా షేర్ ఉందని ఎప్పుడూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే మాట. యూవీ సంస్థ నిర్మించిన తొలి సినిమా ప్రభాస్, అనుష్క కాంబోలో వచ్చిన మిర్చి. అలా మొదలైన యూవీ ప్రయాణం జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇక V సెల్యులాయిడ్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు.