నా భార్యకు క్యాన్సర్.. చిరంజీవి అలా చేస్తారనుకోలేదు - ఉత్తేజ్
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉత్తేజ్ మాట్లాడుతూ.. "నా భార్య పద్మ థర్డ్ స్టేజ్ క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతోంది.
By: Madhu Reddy | 29 Aug 2025 4:00 PM ISTక్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉత్తేజ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో సినిమాల్లో తన నటనతో ఎంతోమందిని మెప్పించారు. అలా కమెడియన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన ఉత్తేజ్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భార్య కాన్సర్ తో పోరాడుతూ ఉంటే చిరంజీవి అలా చేశారు అంటూ ఉత్తేజ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి..
భార్యకు క్యాన్సర్.. చిరంజీవిని కలిసిన నటుడు ఉత్తేజ్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉత్తేజ్ మాట్లాడుతూ.. "నా భార్య పద్మ థర్డ్ స్టేజ్ క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ విషయాన్ని ఎలాగైనా చిరంజీవి అన్నయ్యకి చెప్పాలని ఆయన ఇంటికి వెళ్లాను. అక్కడికి వెళ్లడంతోనే అన్నయ్యతో మాట్లాడాను. ఏంట్రా ఇలా వచ్చావ్ అని అడిగితే కాస్త పర్సనల్ విషయం మాట్లాడాలి అన్నయ్య అని చెప్పడంతో కూర్చొని నాతో ప్రేమగా మాట్లాడారు. నా ఇబ్బందులు చెబుతూ ఉంటే అన్నయ్య కూడా చాలా ఫీల్ అయ్యి నీ ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకోగలనురా అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ విషయం నీకు చెప్పకపోతే నేరం చేసిన వాడిని అవుతాను అన్నయ్య.. పద్మ కూడా ఈ విషయం నీతో చెప్పమంది.అందుకే చెబుతున్నాను..పద్మ కి థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పాను.
ఉత్తేజ్ మాటలతో చిరంజీవి ఎమోషనల్..
ఈ మాట చెప్పడంతోనే చిరంజీవి గారు నన్ను హగ్ చేసుకొని ఏడ్చేశారు.ఇప్పుడే లైఫ్ లో సెటిల్ అవుతున్నావ్.. ఇప్పుడే ఇల్లు కట్టుకుంటున్నావ్..ఈ సమయంలో ఈ కష్టాలు ఏంట్రా అని బాధపడ్డాడు. ఆ తర్వాత నీకు ఏం కావాలో చెప్పురా అంటే నాకేం వద్దు అన్నయ్య అన్నాను.ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నావని అడిగితే బసవతారకం హాస్పిటల్ లో ఉంది అని చెప్పడంతోనే.. బాలయ్య కూడా చాలా మంచివారు. ఆయన కూడా నీకు హెల్ప్ చేస్తారు. నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు నేను స్పెషల్ గా మాట్లాడుతాను అన్నారు.
ఉత్తేజ్ భార్య కన్నుమూత.. చిరంజీవి ఏం చేశారంటే?
అయితే అప్పుడే చిరంజీవి అన్నయ్య చెన్నైలో క్యాన్సర్ గుర్తించే మిషన్ ని ఓపెనింగ్ చేసి వచ్చారు. ఏదైనా క్రిటికల్ పొజిషన్ ఉంటే నాకు చెప్పు నేను మాట్లాడతాను స్పెషల్ గా అని అన్నారు.ఆ తర్వాత ఒకరోజు నా భార్య మరణించింది. నర్స్ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నాకు అప్పటికే అర్థం అయిపోయింది.నా భార్య చనిపోయిందని..ఆ తర్వాత వెంటనే అన్నయ్యకు ఫోన్ చేశాను. పద్మ ఇక లేదు అన్నయ్య అని చెప్పడంతోనే వెంటనే ఆయన నీ దగ్గర ఎవరు ఉన్నారురా అని అడిగారు. ఆ సమయంలో ఆయన అడిగిన ఆ ప్రశ్నకు నేను షాక్ అయిపోయాను.ఇక అప్పుడే అన్నయ్య షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చి..ఆ తర్వాత 7:30 గంటలకు నా దగ్గరికి వచ్చేసారు. అలా 9:30 వరకు అంటే రెండు గంటల పాటు నా దగ్గరే ఉన్నారు.అంతేకాదు ఇప్పటినుండి ఉత్తేజ్ ఇంట్లో స్టవ్ వెలగడానికి లేదు.11 డేస్ వరకు అన్నీ నేనే పంపిస్తానని ఒక మేనేజర్ ని పెట్టి కార్లో బ్రేక్ ఫాస్ట్,లంచ్,డిన్నర్ ఇలా ప్రతి ఒక్కటి ఆయనే పంపించారు.
మలినం లేని గొప్ప వ్యక్తి చిరంజీవి - ఉత్తేజ్
అలాగే నా భార్య సంస్మరణ సభ కూడా అన్నయ్య ఏర్పాటు చేశారు.అయితే ఒక యాక్టర్ చనిపోతేనే ఎవరు పట్టించుకోరు. కానీ ఓ యాక్టర్ భార్య చనిపోతే ఇలా చేయడం నిజంగా ఆయన గొప్పతనమే. అన్నయ్య నా భార్యకి సంస్మరణ సభ ఏర్పాటు చేయడమే కాకుండా ఆయనే స్వయంగా వచ్చి నీకు దేవుడు అన్యాయం చేసాడు అని మాట్లాడం నిజంగా గ్రేట్.. ఆయనతో నాకు రక్తసంబంధం కంటే ఎక్కువ అనుబంధం ఉంది.రక్తసంబంధీకులే ఆస్తులు అంతస్తులు అని కొట్టుకుంటున్నారు.కానీ ఆయనతో నాకు అంతకుమించి అనుబంధం ఉంది. ఎలాంటి మలినం లేని గొప్ప వ్యక్తి చిరంజీవి గారు" అంటూ తన భార్య క్యాన్సర్ గురించి, చిరంజీవితో ఉన్న బాండింగ్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఉత్తేజ్..
