Begin typing your search above and press return to search.

'ఉత్సవం' టీజర్.. కళ చనిపోకూడదు

దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉత్సవం

By:  Tupaki Desk   |   28 Jan 2024 8:38 AM GMT
ఉత్సవం టీజర్.. కళ చనిపోకూడదు
X

దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉత్సవం. నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వగా.. మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

రిహార్సల్ ఆఫ్ ఉత్సవం పేరుతో టీజర్ ను ఆదివారం ఉదయం విడుదల చేసింది చిత్ర యూనిట్. నాటకాల వైభవాన్ని పునరుద్ధరించే ప్రపంచంలోకి అడుగు పెట్టండంటూ క్యాప్షన్ ఇచ్చింది. ది షో మస్ట్ గో ఆన్ అని స్మాల్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కళాకారుడు చనిపోవచ్చు కానీ.. కళ చనిపోకూడదు అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది.

పదిహేనేళ్లు అయిందిరా పాత్ర వేసి.. నుదిట బొట్టు పెట్టుకోగానే కన్నీటి బొట్టు ఆగలేదు అంటూ సీనియర్ యాక్టర్ ఎల్బీ శ్రీరామ్ చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. ఆ తర్వాత నటీనటులంతా హ్యాపీ మోడ్ లో ఉన్నట్లు మేకర్స్ చూపించారు. ఇక హీరోహీరోయిన్ల మధ్య లవ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. తెరపై ఎన్ని పాత్రలు వేసినా కష్టం అనిపించలేదురా.. కానీ రెండు గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టమనిపిస్తుందంటూ ప్రకాశ్ రాజ్ ఆసక్తికర డైలాగ్ తో టీజర్ ముగిసింది. అయితే ఉత్సవం టీజర్.. సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

లవ్, ఎమోషన్స్ తో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ సినిమాను హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్ పై సురేశ్ పాటిల్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా.. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన రసూల్ ఎల్లోర్ ఈ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.