Begin typing your search above and press return to search.

'ఉత్సవం' ఫస్ట్ లుక్.. నట కిరీటంతో కూల్ లుక్

ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వగా త్వరలోనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 2:06 PM GMT
ఉత్సవం ఫస్ట్ లుక్.. నట కిరీటంతో కూల్ లుక్
X

దిలీప్, రెజీనా కసాండ్రా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉత్సవం. నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, 'రచ్చ' రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వగా త్వరలోనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని పెంచింది. పోస్టర్ లో హీరో ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపించారు. తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు వున్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కనిపిస్తోంది.

ఇదే పోస్టర్ లో "షో మస్ట్ గో ఆన్" అనే క్యాప్షన్ కూడా ఉంది. మొత్తంగా ఉత్సవం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసేలా ఉంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లోనే సినిమా టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఉత్సవం టీజర్ ని జనవరి 28న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. 'రిహార్సల్ ఆఫ్ ఉత్సవం' పేరుతో టీజర్ ని జనవరి 28న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు.

లవ్, ఎమోషన్స్ తో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఏకైకుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం వంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.