పుష్ప2 వల్ల మా సినిమా చచ్చిపోయింది
పుష్ప2 థియేటర్లలో ఆడుతున్న టైమ్ లో నార్త్ ఆడియన్స్ స్ట్రయిట్ హిందీ సినిమాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు.
By: Tupaki Desk | 21 April 2025 11:36 AMగతేడాది డిసెంబర్ లో రిలీజైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో పుష్ప2 రికార్డులు సృష్టించింది. స్ట్రయిట్ మూవీ కూడా సాధించలేని విధంగా రూ.800 కోట్ల కలెక్షన్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పుష్ప2 కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
పుష్ప2 థియేటర్లలో ఆడుతున్న టైమ్ లో నార్త్ ఆడియన్స్ స్ట్రయిట్ హిందీ సినిమాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా అందరూ పుష్ప2 గురించే మాట్లాడారు. రీసెంట్ గా ఈ విషయమై బాలీవుడ్ యంగ్ హీరో ఉత్కర్ష్ శర్మ మాట్లాడాడు. పుష్ప2 సినిమా వల్ల తమ సినిమా చచ్చిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వనవాస్ సినిమా గతేడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా మిక్స్డ్ టాక్ కే పరిమితమైంది. తమ సినిమాకు సరైన రిజల్ట్ రాకపోవడంపై తాజాగా ఉత్కర్ష్ శర్మ స్పందిస్తూ, అదే టైమ్ లో రిలీజైన పలు సినిమాలను తప్పుబడుతూ మాట్లాడాడు.
స్క్రీన్ వార్స్ వల్ల తమ సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయిందని, తమ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తనకు క్లారిటీ వచ్చిందని అన్నాడు. రిలీజ్ డేట్ విషయంలో ఇంకాస్త ఆలోచించి ఉంటే తమ సినిమాకు మంచి రిజల్ట్ వచ్చి ఉండేదని, అదే టైమ్ లో పుష్ప2, బేబీ జాన్ సినిమాలు కూడా రిలీజయ్యాయయని, ఆ సినిమా మధ్య తమ సినిమా నలిగిపోయిందని చెప్పాడు.
ఫస్ట్ వీక్ లో తమ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత స్క్రీన్స్ దొరకలేదని, దీంతో అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కు చేరకముందే మా సినిమా చచ్చిపోయిందని, ఆ ఎఫెక్ట్ వల్లే కలెక్షన్లు కూడా సరిగా రాలేదని ఉత్కర్ష్ చెప్పాడు. మన దేశంలో స్క్రీన్స్ చాలా తక్కువ ఉన్నాయని, ఒకేసారి రెండు మూడు సినిమాలను చూసేందుకు కావాల్సినన్ని స్క్రీన్లు ఇండియాలో లేవని, దీంతో పోటీ ఏర్పడుతుందని, ఆ పోటీ వల్ల తమ సినిమా లాంటి ఎన్నో సినిమాలు నలిగిపోతున్నాయని, ఇలాంటి పోటీలు ఫ్యూచర్ లో ఉండకూడదని కోరుకుంటున్నట్టు ఉత్కర్ష్ తెలిపాడు.