'భీమ్లానాయక్' మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
దీంతో అందరి దృష్టి ఇప్పుడు ట్రైలర్‌పై పడింది. 15 ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అత్యంత భారీ స్థాయిలో యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.
By: Ravindar Gorantla | 14 March 2026 3:10 PM ISTపవర్ స్టార్ పవన్‌కల్యాణ్ `ఓజీ` వంటి బ్లాక్ బస్టర్ తరువాత చేసిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ `ఉస్తాద్ భగత్‌సింగ్`. హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో `గబ్బర్‌సింగ్` తరువాత వస్తున్న సినిమా ఇది. దీంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీని మార్చి 19న ఉగాది సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మైత్రీమూవీ మేకర్స్ రిలీజ్‌కు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
అయితే భగత్‌సింగ్ పాటలకు మాత్రం ఆ రేంజ్ రెప్పాన్స్ లభించలేదు. పవన్ మార్కు పాటల్లో కనిపించలేదని, `గబ్బర్‌సింగ్` సాంగ్స్ తరహాలో మ్యాజిక్ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి ఇప్పుడు `ఉస్తాద్ భగత్‌సింగ్` ట్రైలర్‌పై పడింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ అప్ డేట్ రానే వచ్చేసింది. మార్చి 14 అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి సినిమాపై హైప్ తీసుకొచ్చారు.
దీంతో అందరి దృష్టి ఇప్పుడు ట్రైలర్‌పై పడింది. 15 ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అత్యంత భారీ స్థాయిలో యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. దానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ట్రైలర్ రిలీజ్ చేసి హంగామా మొదలు పెట్టాలని, ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే `ఉస్తాద్ భగత్‌సింగ్` ట్రైలర్‌కు ఇప్పుడు భారీ ఛాలెంజ్ ఎదురవుతోంది. అదే `భీమ్లానాయక్`. ఈ మూవీ రిలీజ్ సమయంలో మొదలైన సందడి, అభిమానులు హంగామా అంతా ఇంతా కాదు.
ఆ మూవీ ఫస్ట్ గ్లింప్స్ నుంచే అసలు హంగమా మొదలైంది. మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టారు. అదే ఫార్ములాని ఫాలో అవుతూ ట్రైలర్ బలంగా ఉంటే సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్‌పై పెద్ద బాధ్యత ఉంది. దాన్ని కరెక్ట్‌గా నిర్వహించి హరీష్ సినిమాపై హైప్‌ని తీసుకొస్తే `భీమ్లానాయక్` మ్యాజిక్ మళ్లీ రిపీట్ కావడం ఖాయం. మరి ఆ మ్యాజిక్‌ని హరీష్ శంకర్ రిపీట్ చేస్తాడా? ..ఫ్యాన్స్‌లో మళ్లీ మునుపటి జోష్‌ని నింపుతాడా? అన్నది వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీ బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మార్చి 19 తెల్లవారు జామున 4 నుంచి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షోలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇవ్వగా టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశం ఇచ్చింది.
