Begin typing your search above and press return to search.

'ఉస్తాద్' ట్రైలర్.. పైలెట్ కోపం కట్టలు తెచ్చుకుంటే..

సినిమా లో మూడు విభిన్నమైన కోణాల్లో శ్రీ సింహ కథలు కొనసాగిపోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 July 2023 4:48 PM GMT
ఉస్తాద్ ట్రైలర్.. పైలెట్ కోపం కట్టలు తెచ్చుకుంటే..
X

శ్రీ సింహ కోడూరి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ బాక్సాఫీస్ వద్ద అతనికి సరైన విజయాలు మాత్రం రావడం లేదు. జక్కన్న, కీరవాణి బ్రాండ్స్ ఉన్నప్పటికీ వారి సపోర్ట్ లేకుండా కొత్త వారితోనే ప్రయోగాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక అతను తదుపరి చిత్రం చిత్రం "ఉస్తాద్" ఇప్పటికే ఒక టీజర్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే కొన్ని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించారు. ఇక థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు.


ట్రైలర్ లో శ్రీ సింహ పాత్రను విభిన్న కోణాల్లో హైలెట్ చేశారు, సూర్య అనే సాధారణ మధ్యతరగతి అబ్బాయి ఆకాశంలో ఎగరాల ని పెద్ద కలలు కనేవాడు. అతను పైలట్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇక అతను ఆశయాన్ని సాధించాడని అనిపిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోషించిన గొప్ప కెప్టెన్ జోసెఫ్ డిసౌజాకి సూర్య కో-పైలట్‌గా ఉన్నాడు. సూర్య యుక్తవయస్సులో విధ్వంసక ఆవిర్భావానికి దారితీసే ఆవేశపూరిత కోపాన్ని చూపించారు..

వస్తువులు సరిగా పనిచేయకపోతే వాటి పై కోపాన్ని చూపించే ఆ యువకుడు ఆ తర్వాత కలలు కన్నట్లుగానే ఒక పైలెట్ అవుతాడు. కానీ అక్కడ కూడా అతని కోపం మరింత ఎక్కువవుతుంది. ఇక విమానం లో ప్రయాణం లో ఉండగానే పైలట్ గా అతను కోప్పడినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వాటిని దాటి ఒక మెషిన్ ను కూడా నమ్మగలిగితే ఎలాంటి అనుభవాన్ని పొందవచ్చు అని అంశాలను ట్రైలర్ లో చూపించారు.

సినిమా లో మూడు విభిన్నమైన కోణాల్లో శ్రీ సింహ కథలు కొనసాగిపోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఒక గొప్ప లక్ష్యం ఇలా మూడు కోణాల్లో సినిమా కొనసాగిపోతున్నట్లు తెలుస్తోంది. కావ్య కళ్యాణ్‌రామ్ సూర్య ప్రియురాలిగా నటించింది. ఇక సూర్య అత్యంత ప్రియమైన బైక్ ఉస్తాద్.

కానీ అతని కోపం వలన బైక్, గర్ల్‌ఫ్రెండ్‌ తో సహా అన్నింటినీ కోల్పోయేలా చేస్తాయి. ట్రైలర్ లో సూర్య అతని విడదీయరాని బైక్ ఉస్తాద్ ప్రపంచాన్ని అందంగా హైలెట్ చేశారు. ఈ చిత్రం లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవి శివ తేజ మరియు సాయి కిరణ్ యెడిద వంటి ప్రతిభావంతులైన నటులు నటించారు.

ఇక వారాహి చలనచిత్రం మరియు కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాల పై సాయి కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ చిత్రం ఈ ఆగస్టులో థియేటర్లలోకి రానుంది. "ఉస్తాద్" అనేది ఒక సాధారణ కుర్రాడి నుండి పెద్ద కలలు కనే ఒక పైలట్‌ గా తన ఆశయాన్ని నెరవేర్చుకునే వరకు సూర్య యొక్క ప్రయాణం. భావోద్వేగ హెచ్చు తగ్గులు సరదా అంశాల తో ముడిపడి ఉన్న కథ. మరి ఈ కథతో శ్రీసింహ సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.