Begin typing your search above and press return to search.

చిరంజీవి ఇంటి లాన్ లో పడిదొర్లాడిన ముగ్గురు హీరోలు.

ఉస్తాద్ ప్రతి ప్రోమో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. శర్వానంద్ తో మంచు మనోజ్ ప్రోమో కూడా అలరించింది

By:  Tupaki Desk   |   8 Feb 2024 5:02 PM GMT
చిరంజీవి ఇంటి లాన్ లో పడిదొర్లాడిన ముగ్గురు హీరోలు.
X

మంచు మనోజ్ హోస్ట్ గా ఈటీవీ విన్ లో వస్తున్న టాక్ షో ఉస్తాద్ ర్యాంప్ ఆడేద్దాం. రీసెంట్ గా మొదలైన ఈ షో ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్ గా ఈ షోకి యువ హీరో శర్వానంద్ అటెండ్ అయ్యారు. మ్యాన్ విత్ ఫ్యామిలీ అంటూ మంచు మనోజ్ శర్వానంద్ కి లీడ్ ఇచ్చారు. అదేంటి బాబాయ్ అంటే ఫ్యామిలీ మ్యాన్ ని రివర్స్ లో చెప్పా అన్నాడు. అంతేకాదు రాముడు మంచి బాలుడు టైప్ నేను అని శర్వానంద్ అంటే అది రాముడు నువ్వు కాదని అంటాడు.

ఇక ఇదే షోలో చిరంజీవి చరణ్ తో ఉన్న శర్వానంద్ ఫోటో చూపించగా ఆ లాన్ లో తర్వాత ఏం చేశామో తెలుసా బాబాయ్ అనగా.. శర్వానంద్ గుర్తు లేదన్నట్టు ఉండగా పడి దొర్లాడామని మంచు మనోజ్ అన్నారు. ఇక ఒక అభిమాని తనని శర్వానంద్ లా అవ్వాలని సూచించారని చెప్పగా.. నన్ను చూపించి ఇలా అవ్వకూడదని అన్నారా అని మంచు మనోజ్ అంటాడు.

ఉస్తాద్ ప్రతి ప్రోమో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. శర్వానంద్ తో మంచు మనోజ్ ప్రోమో కూడా అలరించింది. ఇక ఇదే ప్రోమోలో చరణ్ లాంటి ఫ్రెండ్ ఉండటం చాలా లక్కీ అని చెప్పారు శర్వానంద్. ఐతే వీరి బ్యాచ్ లో మంచు మనోజ్ కూడా ఉన్నాడని ఈ ప్రోమోతోనే తెలిసింది.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో ఒకటి ఉంటుందని టాక్. ఈ సినిమాతో పాటుగా లూజర్ వెబ్ సీరీస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో కూడా శర్వానంద్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఫ్యామిలీ ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తున్న శర్వానంద్ ఈమధ్య సక్సెస్ ట్రాక్ తప్పాడు. అయితే రాబోయే సినిమాలతో మళ్లీ తన ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు శర్వానంద్. వస్తున్న సినిమాలు కూడా మంచి కాంబినేషన్స్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ల మీద అంచనాలు భారీగా ఉన్నాయి.