Begin typing your search above and press return to search.

ఉస్తాద్ పవర్ఫుల్ రీ స్టార్ట్.. పవన్ లుక్ వైరల్!

ఇక పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో కలిసి పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 10:30 AM GMT
ఉస్తాద్ పవర్ఫుల్ రీ స్టార్ట్.. పవన్ లుక్ వైరల్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అయితే ఎప్పుడో రావాలి. గబ్బర్ సింగ్ సినిమా అనంతరం హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకుండానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనేక రకాలుగా మార్పులు జరిగాయి.


పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ప్రభావం వలన కూడా కొంత కథ విషయంలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక దర్శకుడు తెరి రీమేక్ కథను మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాపై మాత్రం పాజిటివ్ అంచనాలు క్రియేట్ అయ్యేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

ఇక మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను అయితే మళ్లీ ఇటీవల సరికొత్తగా రీస్టార్ట్ చేశారు. హరిష్ శంకర్ పట్టుబట్టి మరి పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకుని ఈ సినిమాను ఇటీవల మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక లేటెస్ట్ గా సెట్స్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన విధానం ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్లో పోలీస్ బ్యాగ్రౌండ్ లో కొన్ని పవర్ఫుల్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో కలిసి పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ అందులో పోలీస్ డ్రెస్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఈ లుక్కు మాత్రం అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక దర్శకుడు హరీష్ శంకర్ సినిమాపై రీమేక్ మచ్చ రాకుండా ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే రీమేక్ ముద్ర కారణంగా మెగా హీరోలకు చాలా డిజాస్టర్స్ అయితే ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాతో రీమిక్ అనే బ్యాడ్ సెంటిమెంట్ ను అయినా తొలగించాలి అని దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమాకు అక్టోబర్లో కొన్ని రోజుల డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లిస్టులో హరిహర వీరమల్లు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు మాత్రమే ఎలక్షన్ తరువాతే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.