Begin typing your search above and press return to search.

'ఉస్తాద్‌..' యాక్షన్‌ మోడ్​లో పవన్ కల్యాణ్​

ఇందులో పవన్‌కల్యాణ్‌ గన్‌ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చొని కనిపించారు. 'ది ఉస్తాద్‌ ఈజ్‌ ఇన్‌ యాక్షన్‌' అని టీమ్‌ క్యాప్షన్ రాసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   7 Sep 2023 1:43 PM GMT
ఉస్తాద్‌.. యాక్షన్‌ మోడ్​లో పవన్ కల్యాణ్​
X

ఓ వైపు పాలిటిక్స్​.. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌. ఒక్కో సినిమాకు కొంత సమయాన్ని కేటాయిస్తూ వరుస సినిమా షూటింగ్స్​లో పాల్గొంటున్నారు. అయితే రీసెంట్​గా ఆయన పుట్టినరోజు నుంచి వరుసగా సినిమా అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన నటిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమాకు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చింది.


పవన్ కల్యాణ్​ ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. యాక్షన్ మూడ్​లోకి వెళ్లిపోయారు. నేడు(సెప్టెంబర్ 7) నుంచి ఆయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. పవర్ ప్యాక్డ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ తాజాగా ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్‌ గన్‌ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చొని కనిపించారు. 'ది ఉస్తాద్‌ ఈజ్‌ ఇన్‌ యాక్షన్‌' అని టీమ్‌ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇకపోతే ఈ సినిమాను పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్ చేస్తున్నారు. 'గబ్బర్‌ సింగ్‌' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌ ఆఫీసర్​ పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు.

ఇంకా ఈ సినిమాలో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అశుతోష్​ రానా, నవాబ్ షా, కేజీయఫ్ ఫేమ్ అవినాశ్, గౌతమి, నర్రా శ్రీను, నాగా మహేశ్​, టెంపర్ వంశీ సహా పలువురు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్​పై సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్​ దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కే దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయనంక బోస్​ డీఓపీ, చోటా కే ప్రసాద్​ ఎడిటింగ్​, ప్రొడక్షన్ డిజైనర్​ ఆనంద్​ సాయి, పోరాట సన్నివేశాలను రామ్ లక్ష్మణ్​.. ఇలా హైక్లాస్ టెక్నికల్ టీమ్ సినిమా కోసం పనిచేస్తోంది.

ఇకపోతే ఇప్పటికే ఉస్తాద్‌ భగత్‌ సింగ్ గ్లింప్స్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ అందుకుని నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. భగత్‌.. భగత్‌ సింగ్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్‌ తనదైన మ్యానరిజంతో చెప్పిన డైలాగ్​ సినిమాపై మంచి హైప్​ను క్రియేట్ చేసింది.