Begin typing your search above and press return to search.

పవన్ కోసం పవర్ఫుల్ విలన్

తమిళ యాక్టర్​ ఆర్ పార్తీబన్​ను సెలెక్ట్ చేశారట. కోలీవుడ్​లో డైరెక్టర్​గా యాక్టర్​గా మూడు దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 2:53 PM GMT
పవన్ కోసం పవర్ఫుల్ విలన్
X

పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్​ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ అవ్వలేదు. మూవీ టీమ్​ కూడా ఎటువంటి విషయం కూడా చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రం విలన్ ఎవరనేది వివరాలు తెలిశాయి.

వివరాళ్లోకి వెళితే.. ఉస్తాద్ భగత్ సింగ్​.. ఒరిజినల్ వెర్షన్ తేరిలో విలన్​ రోల్​ను మహేంద్రన్ చేశారు. అద్భుతంగా నటించారు. గతంలో ఓ సారి ఈ విలన్​ పాత్ర కోసం తనను అడిగారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ ప్రతినాయకడి పాత్ర గురించి ఎటువంటి సమాచారం రాలేదు.

అయితే తాజాగా ఆ విలన్​ రోల్​ ఖరారు చేసినట్టుగా సమాచారం అందింది. అప్పుడు గబ్బర్ సింగ్ కోసం అభిమన్యు సింగ్​ను తీసుకున్న హరీశ్​ ఈ సారి కూడా అలానే ఫ్రెష్ ఫేస్​ను తీసుకొస్తున్నారట. తమిళ యాక్టర్​ ఆర్ పార్తీబన్​ను సెలెక్ట్ చేశారట. కోలీవుడ్​లో డైరెక్టర్​గా యాక్టర్​గా మూడు దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు.

ఈయన తెలుగులో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో కనిపించారు. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్​లోని కొన్ని సన్నివేశాల్లో. ఫుల్ లెన్త్ రోల్​ కాదు. అయితే ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్​లో మాత్రం ఎక్కువ స్పేస్ కనిపించనున్నారట. హరీశ్​ శంకర్ ఆయన విలన్​ రోల్​ను ఫుల్​ లెంగ్త్​లో డిజైన్ చేశారట.

వాస్తవానికి డబ్బింగ్ చిత్రాలు చూసేవారి.. పార్తీబన్ సుపరిచితుడే. రీసెంట్​గా పొన్నియిన్​ సెల్వన్​లోనూ కనిపించారు. తెలుగులో బండ్ల గణేశ్ నటించిన డేగల బాబ్లీ ఒరిజినల్ వెర్షన్​ కూడా ఈయనే చేశారట. కాగా, ఉస్తాద్​ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వీలైతే సంక్రాంతి లేదా ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.