Begin typing your search above and press return to search.

పవన్ సర్ ప్రైజ్ వెనుక అసలు ప్లాన్ ఏంటి?

ఓవైపు పవన్ రాజకీయాల్లో బిజీగా గడుపుతుంటే.. మరోవైపు ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందంటూ తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 March 2024 6:15 AM GMT
పవన్ సర్ ప్రైజ్ వెనుక అసలు ప్లాన్ ఏంటి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీతో ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల డేట్ ను ఇటీవల ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రచారంలో తలమునకలయ్యారు. అటు పార్టీ కార్యకర్తలతో పాటు ఇటు ప్రజలతో ముచ్చటిస్తూ మమేకమవుతున్నారు. చాలా రోజుల క్రితమే సినిమా షూటింగ్ లన్నింటినీ పక్కన పెట్టేశారు. మళ్లీ మొత్తం రాజకీయ వేడి తగ్గిన తర్వాతే.. సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

ఓవైపు పవన్ రాజకీయాల్లో బిజీగా గడుపుతుంటే.. మరోవైపు ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందంటూ తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో ఉస్తాద్ మేకర్స్.. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇన్ డైరెక్ట్ గా ఇదే విషయం చెప్పింది. ఎక్స్‌పెక్ట్ ద అన్ ఎక్స్ పెక్టెడ్ ఫ్రమ్ ఉస్తాద్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఖరారైంది.

ఇప్పుడు ఈ సర్ప్రైజ్ ప్లాన్ కోసమే నెట్టింట చర్చ నడుస్తోంది. నార్మల్ గా ఏ సినిమా నుంచైనా హీరో బర్త్ డేకు లేక ఏదైనా ఫెస్టివల్ కు అప్డేట్ ఇస్తారు. రిలీజ్ కు ముందు అప్డేట్స్ ఇస్తుంటారు. కానీ పవన్ బిజీ అవ్వడంతో షూటింగ్ ఆగిపోయిన మూవీ నుంచి ఇప్పుడెందుకు ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అది కూడా పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉన్న టైంలో ఎందుకని అనుకుంటున్నారు.

అలా అని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అప్డేట్ కోసం డిమాండ్ చేయడం లేదు. మరి ఈ సర్ప్రైజ్ ఇప్పుడెందుకు ప్లాన్ చేశారో మేకర్స్ కే తెలియాలి. అయితే ఈ సినిమాలోని పవన్.. ప్రభుత్వంపై వేసే కౌంటర్ డైలాగులను టీజర్ రూపంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ ప్రచారానికి మంచి బూస్టప్ ఇవ్వడానికే మేకర్స్ ఇలా చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, మార్చి 19వ తేదీన ముంబై సిటీలో అమెజాన్.. ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో ఉస్తాద్ మూవీ టీమ్ పాల్గొంటోందట. అక్కడ ఈ స్పెషల్ టీజర్ ను వేయనున్నారట. అంతకన్నా ముందే ఆ గ్లింప్స్ ను ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయనున్నారట. మరి వీటిలో ఏది నిజమో ఇంకా తెలియదు. మొత్తానికి గ్లింప్స్ పేరుతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.