Begin typing your search above and press return to search.

అంతకు మించి నువ్వేమి చేయగలవు.. ఉస్తాద్ కౌంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసింది

By:  Tupaki Desk   |   20 Sep 2023 8:47 AM GMT
అంతకు మించి నువ్వేమి చేయగలవు.. ఉస్తాద్ కౌంటర్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసింది. దీంతో, ఆయన తదుపరి మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే, పవన్ వేరే విషయాల్లో బిజీగా ఉండటం వల్ల, ఆ మూవీ వాయిదా పడుతూ వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా, ఈ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. దాని ప్రకారం, ఈ మూవీ షూటింగ్ 50శాతం పూర్తయ్యిందట. ఇదే విషయంపై ఓ అభిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఓ ట్వీట్ చేశాడు. 'ఉస్తాద్ భగత్ సింగ్' 50శాతం పూర్తయ్యిందంట కదా సర్, ఇక క్వాలిటీ ఆ దేవుడి మీదే భారం వేశాం' అంటూ ట్వీట్ చేశాడు. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా సరదాగా కౌంటర్ ఇవ్వడం విశేషం.

'అంతే కదా తమ్ముడు అంతకు మించి నువ్వేమి చేయగలవు చెప్పు..? ఈ లోగా కాస్త కెరీర్, జాబ్, స్టడీస్ మీద ఫోకస్ పెట్టు, వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు, ఆల్ ది బెస్ట్' అంటూ స్వీట్ గా కౌంటర్ వేస్తూ రిప్లే ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంకేముంది ఇతర ఫ్యాన్స్ కూడా ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తుండటం విశేషం. కెరీర్ పోయినా పర్వాలేదు కానీ, మళ్లీ గబ్బర్ సింగ్ లాంటి ఓ హిట్ ఇవ్వండి చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందట.ఇటీవల హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అంతకంటే ముందు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎడిటింగ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు చెప్పారు.

భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, దాని ఎడిటింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుగుతోంది. మరి ఈ సినిమాతో హరీష్ పవన్ ఫ్యాన్స్ ని ఏమాత్రం మెప్పిస్తాడో చూడాలి.