Begin typing your search above and press return to search.

ఆ కటౌట్ కి ఉన్న క్రేజే వేరు..!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది

By:  Tupaki Desk   |   14 Sep 2023 6:27 AM GMT
ఆ కటౌట్ కి ఉన్న క్రేజే వేరు..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. సినిమా పాలిటిక్స్ రెండిటికీ అసలు సంబంధం లేకపోయినా పర్ఫెక్ట్ షెడ్యూల్ తో అక్కడ ఇక్కడ తన ప్రెజెన్స్ ఉండేలా చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో తను కమిటైన సినిమాలన్నీ కూడా పూర్తి చేసేలా ప్లానింగ్ లో ఉన్నారు పవన్. ఈ క్రమంలో ఓ పక్క సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ తో పాటుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా లాగించేస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలిసినే. సినిమా నుంచి లెటెస్ట్ గా క్రేజీ ఫోటో షేర్ చేశారు మేకర్స్. సీన్ వివరిస్తున్న హరీష్ శంకర్ వైపే దృష్టి పెట్టి చూస్తున్నారు పవన్ కళ్యాణ్. పోలీస్ డ్రెస్ లో రఫ్ లుక్ తో కూల్ గాగుల్స్ మెడలో హనుమాన్ లాకెట్ పవర్ స్టార్ ఫోటో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తుంది. నేను ట్రెండ్ ఫాలో అవను సృష్టిస్తానని చెప్పే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో డాషింగ్ లుక్స్ తో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన టీజర్ దుమ్ముదులిపేసింది. పవన్ మీద తనకున్న అభిమానాన్ని ఆయన్ను ఫ్యాన్స్ కోరుకునే విధంగా చూపిస్తూ సత్తా చాటనున్నాడు హరీష్ శంకర్. పవర్ స్టార్ తో సినిమా కోసం దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మరో మాస్ హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

రిలీజైన టీజర్ మాత్రమే కాదు షేర్ చేస్తున్న ఫోటోస్ అన్నీ కూడా ఉస్తాద్ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది తెలియదు కానీ ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలను కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.