Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్.. అసలు పాయింట్ ఉన్నట్లా లేనట్లా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 March 2024 5:19 AM GMT
ఉస్తాద్ భగత్ సింగ్.. అసలు పాయింట్ ఉన్నట్లా లేనట్లా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తెరి రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోందనేది మొదట్లోనే తెలిసిపోయింది. అయితే మేకర్స్ ఆ విషయాన్ని ఎక్కువగా హైలెట్ చేయలేదు. రీమేక్ అయినప్పటికీ మునుపెన్నడూ చూడని సినిమాలా ఉంటుందని దర్శకుడు చెప్పాడు.

ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యాక్షన్, ఎలివేషన్ డైలాగ్స్ తో గ్లింప్స్ వదిలారు.

దీనికి కూడా ఊహించని స్థాయిలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 14 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ ని గ్లింప్స్ కి వచ్చాయి. దీనిని బట్టి అభిమానులు ఆయనని వెండితెరపై ఏ రేంజ్ లో చూడాలని అనుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే తెరి మూవీలో కూతురు సెంటిమెంట్ మెయిన్ పాయింట్ గా ఉంటుంది. కూతురు కోసం పోలీస్ ఉద్యోగాన్ని ఆ సినిమాలో విజయ్ వదిలేస్తాడు. మళ్ళీ కూతురుని కాపాడుకోవడం విలన్స్ ని ఎదురెళ్తాడు.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన రెండు గ్లింప్స్ లలో కూతురు క్యారెక్టర్ ని ఎక్కడా కూడా హైలైట్ చేయలేదు. రీమేక్ కథలని తనదైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోందించి తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో హరీష్ శంకర్ దిట్టా. గతంలో పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ హిందీ దబాంగ్ కి రీమేక్ అయిన ఆ ఛాయలు లేకుండా తనదైన స్క్రీన్ ప్లేతో సూపర్ హిట్ అందుకున్నాడు.

అలాగే గద్దలకొండ గణేష్ తమిళ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్ అయిన ప్యూర్ కమర్షియల్ మూవీగా హరీష్ శంకర్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా హరీష్ శంకర్ అలాంటి మ్యాజిక్ ఏమైనా చేయబోతున్నాడా అనే ఆలోచన సినీ విశ్లేషకులకి కలుగుతుంది. ఈ సినిమాలో పవన్ గాజు గ్లాస్ పై చెప్పిన డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

గ్లింప్స్ బట్టి చూస్తే కంప్లీట్ గా పవర్ స్టార్ ఇమేజ్ మీదనే దృష్టి పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని హరీష్ శంకర్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఇప్పటివరకు కేవలం రెండు టీజర్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి ఎక్కువ కథను రివీల్ చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ట్రైలర్ లో అయినా దర్శకుడు ఇదే ట్విస్ట్ ఇస్తాడా? లేదంటే డైరెక్ట్ గా సినిమాలోనే అసలు పాయింట్ ను రివీల్ చేస్తాడా అనే దానికి కాలమే సమాధానం ఇవ్వాలి.