Begin typing your search above and press return to search.

ఉస్తాద్ డైలాగ్స్.. పవన్ ఫ్యాన్స్ కే నచ్చలేదా?

వీరిద్దరి కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   21 March 2024 2:15 PM GMT
ఉస్తాద్ డైలాగ్స్.. పవన్ ఫ్యాన్స్ కే నచ్చలేదా?
X

ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య షూటింగ్ కాస్త జరగ్గా.. ఏపీ ఎన్నికల్లో పవన్ బిజీ అవ్వడంతో బ్రేక్ పడింది. మళ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఉస్తాద్ షూటింగ్ కు బ్రేక్ పడటంతో హరీష్ శంకర్.. రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. బచ్చన్ మూవీ మొదలుపెట్టే సమయంలో చాలా మంది ఫ్యాన్స్ ఉస్తాద్ సినిమా ఉందా లేదా అని క్వశ్చన్ చేశారు. అప్పుడు ఆ విషయంపై రెస్పాండ్ అవ్వని మూవీ టీమ్.. తాజాగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్పెషల్ టీజర్ ను మంగళవారం విడుదల చేసింది.

అదే రోజు ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ కు హాజరైంది ఉస్తాద్ భగత్ సింగ్ టీం. ఆ సమయంలో అక్కడ స్పెషల్ టీజర్ ను ప్రదర్శించి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ప్రస్తుతం హోల్డ్ లో సినిమా నుంచి గ్లింప్స్ రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. గ్లింప్స్ చూసి సంబరాలు చేసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ లో పవన్ మ్యానరిజాన్ని చూసి ఊగిపోయారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. టీజర్ లోని డైలాగులు చాలా మంది ఫ్యాన్స్ కే నచ్చలేదట. పవన్ రాజకీయ పార్టీ జనసేన గుర్తు గ్లాస్ గురించి పవర్ స్టార్ చెప్పిన డైలాగులు నేచురల్ గా లేవని, అతికినట్లు ఉన్నాయని చెబుతున్నారు. వాటి బదులు వేరే డైలాగ్స్ పెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. డైలాగుల్లో హరీష్ శంకర్ పంచ్ మార్క్ మిస్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్స్ పై నెట్టింట ఫుల్ ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి.

అయితే టీజర్ లో గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, గ్లాసంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ డైలాగులు చెప్పారు పవన్. గ్లింప్స్ రిలీజ్ తర్వాత.. గ్లాస్ పై డైలాగులు.. హరీష్ శంకర్ బాధ భరించలేక చెప్పానని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి పవన్ చెప్పిన డైలాగులు ఆయన ఫ్యాన్స్ లోనే కొందరికి నచ్చలేదన్నమాట. మరి ఈ ట్రోలింగ్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తారో లేదో చూడాలి.