Begin typing your search above and press return to search.

ఫెస్టివల్ ట్రీట్.. పవర్​ఫుల్​గా ఉస్తాద్​ ఆయుధ పూజ​

తాజాగా పవన్ కళ్యాణ్ ఖాకీ లుక్ దుస్తుల్లో ఉన్న మాస్ అవతార్ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:10 PM GMT
ఫెస్టివల్ ట్రీట్.. పవర్​ఫుల్​గా ఉస్తాద్​ ఆయుధ పూజ​
X

టాలీవుడ్​లో స్టార్​ హీరోలతో భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అప్ కమింగ్ చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నేడు విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్నింటినీ నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీస్​ నుంచి మాస్ లుక్స్​తో అభిమానులను ఖుషీ చేసేలా పవర్​ఫుల్ పోస్టర్స్​ రిలీజ్ అయ్యాయి.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాసీ డైరెక్టర్​ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై మూవీని గ్రాండ్​గా నిర్మిస్తున్నారు. యంగ్​ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. రాక్​ స్టార్​ దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్​ను అందుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖాకీ లుక్ దుస్తుల్లో ఉన్న మాస్ అవతార్ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. అందులో ఆయన సుత్తి భుజాన వేసుకుని కిందకి స్టైల్​గా చూస్తూ కనిపించారు. పవన్ భారీ నీడను కూడా హైలైట్​ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు ఆయుధ పూజా, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో భారీ గ్యాంగస్టర్​ సినిమా ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్​స్టర్​. ఈ చిత్రం నుంచి కూడా పవన్​ పవర్ ఫుల్ లుక్​కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. ఆయుధాలకంటే అతని కంటిచూపు చాలా పవర్ ఫుల్ అనే క్యాప్షన్​తో విడుదల చేశారు. వీరు కూడా ప్రతిఒక్కరికీ.. ఆయుధ పూజా, విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అనే గ్యాంగ్ స్టర్​గా కనిపించబోతున్నారు. 1950ల బ్యాక్‍డ్రాప్‍లో సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రియాంక మోహన్​ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్​పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.