'స్టే' వచ్చేసింది.. మరి నెక్స్ట్ ఏంటి మైత్రీ?
అదే సమయంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించి.. అందరికీ తాత్కాలిక ఊరట లభించేలా ఆదేశాలు తీసుకొచ్చింది.
By: M Prashanth | 13 March 2026 9:03 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాను డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ కాంబో.. మళ్లీ రిపీట్ అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్సెస్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే భారీ బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. ప్రమోషన్స్ ను అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తోంది. మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా సినిమా రిలీజ్ చేయనుండగా.. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్లు స్పీడప్ పెంచింది. స్పెషల్ ప్లాన్ తో ఇంకా బజ్ పెంచేలా ప్లాన్ చేసుకుంది.
అదే సమయంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించి.. అందరికీ తాత్కాలిక ఊరట లభించేలా ఆదేశాలు తీసుకొచ్చింది. టికెట్ రేట్లు పెంచాలంటే చట్టంలో ఉన్న నిబంధన ప్రకారం.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం మెమో ఇవ్వాలని కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా.. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ లతో కూడిన బెంచ్ హైకోర్టు ఆర్డర్స్ పై స్టే విధించింది. ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. సూచించింది. దీంతో త్వరలో విడుదల కాబోయే చిత్రాలకు ఊరట లభించింది. ప్రీమియర్స్ తో పాటు, టికెట్ ధరలను పెంచుకునేందుకు ఛాన్స్ దొరికింది.
దీంతో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ ఏం చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. 90 రోజుల గడువుపై స్టే తెచ్చుకోగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి రేట్ల పెంపుపై దరఖాస్తు చేసుకుంటుందో లేదోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే పిటిషన్ వేసింది కాబట్టి.. కచ్చితంగా రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని కోరుతుందని టాక్ వినిపిస్తోంది. కానీ తక్కువ మొత్తంలో పెంచాలనుకుంటుందని తెలుస్తోంది. ప్రీమియర్స్ విషయంలో మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదట. అయితే ఆ రెండు విషయాల్లో మైత్రీ ఏం చేస్తుందో వేచి చూడాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివ్యేందు శర్మ, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చుతున్నారు. పవన్ మరోసారి సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
