Begin typing your search above and press return to search.

ఉస్తాద్ కోసం రెడీ అవుతున్న శ్రీలీల‌!

దీంతో హ‌రీష్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీమ్ తో పాటూ శ్రీలీల కూడా ఆ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   31 May 2025 8:00 PM IST
ఉస్తాద్ కోసం రెడీ అవుతున్న శ్రీలీల‌!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తను క‌మిట్ అయిన సినిమాలను ఒక్కొక్క‌టిగా పూర్తి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ను పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఓజి సినిమాకు డేట్స్ ను కేటాయించి వీలున్న‌ప్పుడల్లా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్వ‌ర‌లోనే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాకు కూడా ప‌వ‌న్ డేట్స్ కేటాయించ‌నున్నాడు.

దీంతో హ‌రీష్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీమ్ తో పాటూ శ్రీలీల కూడా ఆ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రాబిన్‌హుడ్ సినిమాతో ఫ్లాపును మూట గ‌ట్టుకున్న శ్రీలీల ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌పై చాలానే ఆశ‌లు పెట్టుకుంది. దాంతో పాటూ ఫ్లాపులో ఉన్న శ్రీలీల‌కు ఇప్పుడు హిట్ అవ‌స‌రం చాలానే ఉంది.

ఇదిలా ఉంటే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ లో ప‌వ‌న్ జూన్ నుంచే జాయిన్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప‌వ‌న్, శ్రీలీల మ‌ధ్య షూట్ చేయాల్సిన సీన్స్ కొన్ని పెండింగ్ ఉండ‌టంతో మేక‌ర్స్ శ్రీలీల‌ను బ‌ల్క్ లో డేట్స్ అడిగార‌ని, శ్రీలీల కూడా ఈ విష‌యంలో వారికి అనుగుణంగానే స్పందించి డేట్స్ ను అడ్జ‌స్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

సరైన క‌థ‌ల‌ను సెలెక్ట్ చేసుకోలేక‌పోవ‌డం వ‌ల్ల శ్రీలీల గ‌త కొంత కాలంగా ఫ్లాపుల‌ను అందుకుంటుంది. కాబ‌ట్టి ఇప్పుడు శ్రీలీల తిరిగి బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్క‌డం చాలా అవ‌స‌రం. వాస్త‌వానికి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాను శ్రీలీల త‌న కెరీర్ స్టార్టింగ్ లో ఒప్పుకుంది. ఈ సినిమాతో పెద్ద స్టార్ అవుతాన‌నుకుని ఎన్నో అంచ‌నాల‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను ఓకే చేయ‌గా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది.అయితే ఇప్పుడు శ్రీలీల‌కు స్టార్‌డ‌మ్ అయితే వ‌చ్చింది కానీ దాన్ని మరింత పెంచుకుని కెరీర్ లో ముందుకెళ్ల‌డానికి అర్జెంటుగా ఓ పెద్ద హిట్ అవ‌స‌రం. ఉస్తాద్ భ‌గత్ సింగ్ హిట్ అయితే శ్రీలీల మార్కెట్ పెర‌గ‌డం ఖాయం. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.