Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఉస్తాద్‌ సెట్స్‌లో చిన్నారి శ్రీలీల

ఇదే సమయంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్స్‌ లో చిన్నారి శ్రీలీల ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 12:07 PM IST
పిక్‌టాక్‌ : ఉస్తాద్‌ సెట్స్‌లో చిన్నారి శ్రీలీల
X

శ్రీలీల హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో క్రేజీ మూవీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌. ఆగిపోయింది, రద్దు అయింది, అటకెక్కింది అంటూ వార్తలు వచ్చిన 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్‌ షూటింగ్‌కు హాజరు అయిన వీడియోను సైతం హరీష్ శంకర్‌ అభిమానులతో పంచుకున్నాడు. దాంతో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ విడుదల గురించి, ఇతర విషయాల గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.


ఇదే సమయంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్స్‌ లో చిన్నారి శ్రీలీల ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్స్‌లో అడుగు పెట్టడంతో పాటు, అదే సమయంలో శ్రీలీల కూడా సెట్స్‌లో జాయిన్‌ అయింది. ఇద్దరి కాంబోలో సీన్స్ షూట్‌ చేసి ఉంటారని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌కి శ్రీలీల జాయిన్‌ అయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించేందుకు గాను ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్‌ చేశారు. సినిమాలో శ్రీలీల లుక్‌ను రివీల్‌ చేయకుండా ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. క్యూట్‌ శ్రీలీలకు వెల్‌ కమ్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

పిలక వేసుకున్న శ్రీలీల చిన్నప్పటి ఫోటో భలే ముద్దు వస్తుంది అంటూ నెటిజన్స్ ఆమె ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు. సినిమాలో ఆ ఫోటోను ఏమైనా వినియోగిస్తారేమో అంటూ కొందరు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతానికి ఆ ఫోటో మాత్రం తెగ వైరల్‌ అవుతోంది. శ్రీలీలను ఇప్పటి వరకు చాలా రకాల ఫోటోల్లో చూశాం కానీ ఇలా చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలో మాత్రం చూడలేదు. ఈ విభిన్నమైన లుక్‌ లో శ్రీలీల క్యూట్‌గా ఉంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సెట్స్‌ లో ఈ పోటో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది సినిమా చూస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. త్వరలోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆ అప్‌డేట్‌ ఏంటో చూడాలి.

ఒక తమిళ హిట్‌ మూవీకి రీమేక్‌గా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ప్రారంభం అయింది. కానీ కొన్ని కారణాల వల్ల రీమేక్ కాకుండా ఒరిజినల్‌ స్టోరీతో సినిమాను దర్శకుడు హరీష్ శంకర్‌ రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక మరోసారి సెంటిమెంట్‌ వర్కౌట్ అయ్యి ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా హరీష్ శంకర్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాడని సమాచారం. అదే నిజం అయితే పవన్‌ నటించిన హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.