భగత్ సింగ్ బరిలోకి...ఇక దబిడి దిబిడే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకాచకా పెండింగ్ షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `హరిహరవీరమల్లు` చిత్రీకరణ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది.
By: Tupaki Desk | 10 Jun 2025 6:19 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకాచకా పెండింగ్ షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `హరిహరవీరమల్లు` చిత్రీకరణ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. రీజెంట్ గా `ఓజీ` షూటింగ్ కూడా పూర్తిచేసారు. ఓజీకి సంబంధించి పవన్ డబ్బింగ్ పనులకు హాజరవ్వాల్సి ఉంది. ఈనేప థ్యంలోనే జూన్ రెండో వారం నుంచి `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ కూడా పున ప్రారంభమతుందని దర్శ కుడు హరీష్ శంకర్ ప్రకటించారు.
తాజాగా రెండో వారంలోకి ఎంటర్ అయిన నేపథ్యంలో మగళవారం హైదరాబాద్‌లో అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. అల్యుమినయం ఫ్యాక్టరీలో చిత్రీకరణ ఆరంభించారు. తాజా షెడ్యూల్ దాదాపు నెల రోజు ల పాటు ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ లోనే పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన కీలక సన్ని వేశాలన్నింటి పూర్తి చేసే దిశగా హరీష్ శంకర్ కదలుతున్నారు. పవన్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ తెలుసు కాబట్టి పవన్ జాయిన్ అయిన నాటి నుంచి ఆయనపైనే షూటింగ్ ఉంటుంది.
పవన్ పై సోలో సన్నివేశాలు..కాంబినేషన్ సన్నివేశాలను..యాక్షన్ సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయన పోర్షన్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం రెండు నెలల్లో పూర్తి చేయాల న్నది హరీష్ ప్లాన్. దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని హరీష్ ముందుకు కదులుతున్నాడు. పవన్ వేగం చూస్తుంటే ఇదే ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది.
వీరమల్లు రేపోమాపో రిలీజ్ అయిపోతుంది. అటుపై ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అన్ని అనుకున్నట్లు పూర్తయితే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మూడు ప్రాజెక్ట్ లు బాగా ఆలస్యమైనవే కాబట్టి అభిమానులు ఒకే ఏడాది ట్రిపుల్ ట్రీట్ ఆస్వాదించొచ్చు.