పవన్ కోసం హరీష్ శంకర్ ఆదేశాలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రం షూటింగ్ కి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఓజీ' షూటింగ్ లో పాల్గొంటున్నారు.
By: Tupaki Desk | 30 May 2025 7:09 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రం షూటింగ్ కి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఓజీ' షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ వీలైనంత వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అలాగే జూన్ నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కూడా ప్రారంభించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా తన టీమ్ ను రెడీగా ఉండమని ఆదేశాలు జారీ చేసారుట.
పవన్ షూటింగ్ కి హాజరైన నాటి నుంచి ఎవరూ కూడా ఎలాంటి సెలవులు లేకుండా షూట్ లో పాల్గొనాలని బల్క్ గా డేట్లు కేటాయించాలని ఆదేశించాడట. ముఖ్యంగా పవన్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్న నటులు ఎవ్వరూ కూడా పవన్ పోర్షన్ పూర్తయ్యేంతవరకూ తమకు పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశిం చాడుట. దీంతో ప్రధాన నటులంతా ఆ రకంగా తమ షెడ్యూళ్లను మార్చుకుంటున్నట్లు సమాచారం.
జూన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ మొదలవుతుంది. కానీ పవన్ ఏ తేదీ నుంచి షూటింగ్ కి వస్తారు? అన్నది క్లారిటీ లేదు. అయితే ఈసినిమా కోసం శ్రీలీల మాత్ర సంసిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మడు ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు కొరినట్లు బల్క్ గా డేట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు సందేశం పంపిచిందట. అవసరమైతే హిందీలో చేస్తోన్న సినిమాల డేట్ల విషయంలో రిక్వెస్ట్ చేస్తానని భరోసా ఇచ్చిందట.
ఇంకా పవన్ తో సీన్స్ ఉన్న నటులంతా కూడా హరీష్ శంకర్ కి ఫోన్ చేసి రెడీగా ఉన్నట్లు తెలిపారట. ఈ సినిమా పూర్తి చేయడం పవన్ కంటే హరీష్ శంకర్ కి..అందులో నటిస్తోన్న నటీనటులకే అత్యంత అవసరం. ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ అయి హిట్ అయితే మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయి. పవన్ కూడా నిర్మాత సహా వాళ్లందరి భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్నారు.