ఉస్తాద్ భగత్‌సింగ్... ఒకేసారి రెండు పనులు!
పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత రెండేళ్లుగా సినిమాలను విడుదల చేయలేక పోయాడు.
By: Tupaki Desk | 29 Jun 2025 10:57 AM ISTపవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత రెండేళ్లుగా సినిమాలను విడుదల చేయలేక పోయాడు. చాలా కాలం క్రితం ప్రారంభం అయిన 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తి చేశాడు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. మరో వైపు సాహో సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా సైతం షూటింగ్ పూర్తి అయింది. మరో మూడు నెలల్లో ఆ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సైతం డేట్లు ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా సినిమా గురించి ఆసక్తికర అప్డేట్‌ను మేకర్స్ షేర్ చేశారు.
హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే. ఇక ఓజీ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు గాను దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడూ కూడా మ్యూజికల్ కాన్సర్ట్ అన్నట్లుగా ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్‌ల ట్వీట్స్ ఉన్నాయి.
హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్‌ల కాంబో మూవీస్ ఎక్కువగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అందుకే ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల పాటలతో పోల్చితే కచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ పాటలు శ్రోతలను ఆకట్టుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్ త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమా కోసం వీలు చూసుకుని డేట్లు ఇస్తూ వస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ సైతం జరుగుతున్న నేపథ్యంలో సినిమా సైతం ఇదే ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు సినిమా షూటింగ్, పాటల రికార్డింగ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.
