Begin typing your search above and press return to search.

ఉస్తాద్ త‌ప్పులు చెప్పిన లెజెండ‌రీ రైట‌ర్

గ‌బ్బ‌ర్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్‌ల‌ది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ అవ్వ‌గా.. ఇప్పుడ‌ది ఉస్తాద్ భ‌గ‌త సింగ్ పుణ్య‌మా అని ఫ్లాప్ కాంబినేష‌న్‌గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   24 April 2026 1:30 PM IST
ఉస్తాద్ త‌ప్పులు చెప్పిన లెజెండ‌రీ రైట‌ర్
X

గ‌బ్బ‌ర్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్‌ల‌ది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ అవ్వ‌గా.. ఇప్పుడ‌ది ఉస్తాద్ భ‌గ‌త సింగ్ పుణ్య‌మా అని ఫ్లాప్ కాంబినేష‌న్‌గా మారిపోయింది. విడుద‌ల‌కు ముందు నెల‌కొన్న సందేహాల‌ను నిజం చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో ఏం త‌ప్పులు జ‌రిగాయో.. లెజెండ‌రీ రైట‌ర్ ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌.. త‌న ప‌రుచూరి ప‌లుకులు యూట్యూబ్ ఛానెల్లో విశ్లేషించారు. ఈ సినిమాకు టైటిలే అతి పెద్ద స‌మ‌స్య అని తేల్చేశారు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అన్న‌ది ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ అని, భ‌గ‌త్ సింగ్ అన‌గానే స్వాతంత్ర్యోద్య‌మం, త్యాగం గుర్తుకు వ‌స్తాయ‌ని.. కానీ సినిమాలో హీరో పాత్ర తీరు భిన్నంగా ఉంటుంద‌ని.. నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌లో బాల‌య్య క్యారెక్ట‌ర్‌ను పోలి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి అలాంటి యాప్ట్ టైటిల్ పెట్టి ఉంటే బాగుండేద‌ని ప‌రుచూరి అభిప్రాయ‌ప‌డ్డారు.

తాము ర‌చ‌న చేసిన నిప్పుర‌వ్వ సినిమాలో జ‌రిగిన త‌ప్పు ఉస్తాద్‌లో కూడా జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. బాల‌య్య సినిమాలో ప్ర‌థ‌మార్ధం అంతా యాక్ష‌న్ ఎక్కువ‌గా ఉండి, రెండో అర్ధంలో ల‌వ్ స్టోరీని చూపించామ‌ని.. ర‌ష్ చూసి అది క‌రెక్ట్ కాద‌ని త‌మ‌కు చెప్పినా తాము మార్చ‌లేద‌ని.. ఉస్తాద్‌లో కూడా ఫ‌స్టాఫ్ యాక్ష‌న్ ఎక్కువ‌గా ఉండి, సెకండాఫ్‌లో ల‌వ్ స్టోరీ పెట్టార‌ని.. ప్ర‌థ‌మార్ధంలోకి ఆ ల‌వ్ స్టోరీని తెచ్చి ఉండాల్సింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమాలో హీరో ఎంట్రీ మ‌రీ లేటుగా, 20 నిమిషాల‌కు ఉండ‌డం మైన‌స్ అని.. స్టార్ హీరోల సినిమాల్లో ఇలా ఎంట్రీ ఆల‌స్యం అయితే ప్రేక్ష‌కులు ఒప్పుకోర‌ని.. చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్‌ను కుదించి ప‌ది నిమిషాల‌కే హీరో ఎంట్రీ ఉండేలా చూసుకుని ఉంటే బాగుండేద‌ని ఆయ‌న‌న్నారు. పోలీసాఫీస‌ర్ అయిన హీరో చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఇష్టానుసారం అంద‌రినీ కాల్చిప‌డేయ‌డం కూడా బాగా లేద‌ని ప‌రుచూరి అభిప్రాయ‌ప‌డ్డారు. హ‌రీష్ శంక‌ర్ కొన్ని డైలాగ్స్ బాగా రాశార‌ని.. కొన్ని సీన్లు బాగా తీర్చిదిద్దార‌ని.. కానీ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే సినిమా మంచి ఫ‌లితం అందుకునేద‌ని ప‌రుచూరి అన్నారు.