గబ్బర్ సింగ్ ను మించి ఉంటుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్.
By: Sravani Lakshmi Srungarapu | 11 March 2026 12:43 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. దానికి కారణం ఆ సినిమాను డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్ కావడమే. ఎందుకంటే పవన్ కు హరీష్ వీరాభిమాని. పైగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ పై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి.
మార్చి 19న ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్
దానికి తగ్గట్టే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉస్తాద్ గబ్బర్ సింగ్ టీజర్, సాంగ్స్ మంచి ఆదరణ దక్కించుకోగా, ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
పవన్ కెరీర్లోనే బెస్ట్ ఇంటర్వెల్
అందులో భాగంగానే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ఇంటర్వెల్ గురించి హరీష్ చేసిన కామెంట్స్ సినిమాపై ఉన్న హైప్ ను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అవుతుందని, ఆ సీన్ లో పవన్ ను తాను నెక్ట్స్ లెవెల్ లో ఎలివేట్ చేశానని, థియేటర్లలో ఫ్యాన్స్ అది చూసి స్టన్ అవడం ఖాయమని చెప్తున్నారు.
గబ్బర్ సింగ్ లో చూసింది చాలా తక్కువ
అంతేకాదు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో పవన్ ను గబ్బర్ సింగ్ లో కంటే బాగా ప్రెజెంట్ చేశానని, ఆ సినిమాలో చూసింది ఒకెత్తే అని హరీష్ అన్నారు. మామూలుగా హరీష్ శంకర్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ సినిమానే. ఆ సినిమాతో అతను ఇచ్చిన ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా గబ్బర్ సింగ్ ను మించేలా ఉంటుందని చెప్పడం చూస్తుంటే హరీష్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తోంది.
ఆ విషయంలో స్వార్థంగా ఉంటా
పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన హరీష్, ఆయన్ని స్క్రీన్ పై మరింత పవర్‌ఫుల్ గా చూపించాలనే కోరిక తనకెప్పుడూ ఉంటుందని తెలిపారు. పవన్ విషయానికొస్తే ఒక డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ఒక ఫ్యాన్ గా కూడా పవన్ ను ఎలివేట్ చేయాలనిపిస్తుందని, అది తన స్వార్థమని, ఈ సినిమా చూశాక పవన్ ను ఇంత మాస్ గా చూపించాలంటే హరీష్ శంకర్ మాత్రమే అని అందరూ అనాలని అదే తన టార్గెట్ అని హరీష్ చెప్పారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పాటలు దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ అందిస్తున్నారు. మరి హరీష్ ఇస్తున్న ఎలివేషన్ల లాగే సినిమా అందరినీ మెప్పిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
