ఉస్తాద్ కోసం మరో హీరోయిన్.. అమెకిది లక్కీ ఛాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్. సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 19 July 2025 9:54 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్. సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో గబ్బర్ సింగ్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు కారణాల వల్ల గతంలో ఆగిపోయిన షూటింగ్ ఇటీవల పునః ప్రారభమైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
చకచకా షూటింగ్ పనులు పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సినిమా స్క్రిప్ట్ లో దర్శకుడు హరీశ్ కొన్ని మార్పులు చేశారంట. ఆయా మార్పుల ప్రకారం సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ భావించి, రెండో హీరోయిన్ పాత్ర కూడా రాశారు.
దీంతో ఇందులో సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నాను ఎంపిక చేశారు. ఈ రోల్ కోసం చాలా మంది హీరోయిన్లను పరిశీలించి, ఆఖరికి రాశీ ఖన్నాను ఫైనలైజ్ చేశారు. ఆల్రేడీ ఈమె షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమెపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజా అప్డేట్ తో హరీశ్ శంకర్ సెకండ్ హీరోయిన్ తో ఏం ప్లాన్ చేశారోనని ఆత్రుత పవర్ స్టార్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది.
అయితే రాశీ ఖన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఓ దశాబ్దం దాటి పోయింది. ఇప్పటికీ సరైన హిట్ లేదు ఈ అమ్మడు ఖాతాలో. రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చినా అదీనూ సెకండ్ హీరోయిన్ గానే. మళ్లీ బడా స్టార్స్ తో ఆఫర్స్ కూడా రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాతో ఛాన్స్ రావడంతో రాశీ ఫేట్ మారుతుందని ఆశిస్తోంది. మరి రాశీ ఈ సినిమాతో ఇంకో లెవెల్ కు వెళ్తుందా చూడాలి!
కాగా, ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. మరోవైపు పవన్ మరో వారంలో హరిహర వీరమల్లు సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాతో రానున్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది.
