Begin typing your search above and press return to search.

బాలయ్య మూవీ షూట్ లో ఆమెకు ఏం అయ్యింది?

ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమాను ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   10 July 2024 6:14 AM GMT
బాలయ్య మూవీ షూట్ లో ఆమెకు ఏం అయ్యింది?
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమాను ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ పై కన్ను వేసిన బాలయ్య షూటింగ్‌ ను చకచక పూర్తి చేసేందుకు బల్క్ డేట్లు ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఎన్నికల కారణంగా మూడు నెలల పాటు పూర్తిగా షూటింగ్‌ కి దూరంగా ఉన్న బాలయ్య ఇటీవలే ఎన్నికల హడావిడి పూర్తి చేసుకుని షూటింగ్‌ కు జాయిన్‌ అయ్యాడు. తాజా షెడ్యూల్‌ లో హీరోయిన్‌ ఊర్వశి రౌతేలాతో పాటు పలువురు ముఖ్య నటీనటులు పాల్గొన్నారు.

ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అనూహ్యంగా హీరోయిన్ ఊర్వశి కి గాయాలు అయ్యాయట. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని గురించి అధికారికంగా దృవీకరించలేదు. కానీ బాలయ్య మూవీలో ఊర్వశి కి చిన్న ప్రమాదం జరిగి గాయాలు అయిన మాట మాత్రం వాస్తవం అని రూమర్ వినిపిస్తుంది .

ఇంతకు ఊర్వశి రౌతేలా కి ఏం అయ్యింది అనేది మాత్రం క్లారిటీ రాలేదు. సోషల్‌ మీడియాలో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. టాలీవుడ్‌ లో ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలయ్య తో సర్‌ప్రైజ్ చేయబోతుంది.

తెలుగు లో మొదటి సారి హీరోయిన్‌ గా నటిస్తున్న ఊర్వశి రౌతేలా ఇలా ప్రమాదానికి గురి అవ్వడం బాధాకరం. బాలయ్య తో చేస్తున్న ఈ సినిమా తర్వాత ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌ లో సీనియర్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.